Zodiac Nature: మీ రాశిని బట్టి మీరు ఖర్చు చేసేవారా లేదా పిసినారి వారా చెప్పేయవచ్చు!

Nature by Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రంలో, డబ్బు ఖర్చు చేయడంలో ఏ రాశికి చెందిన వ్యక్తికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో కూడా చెప్పబడింది. అంటే, అతను పిసినారి వాడా లేదా దుబారా చేస్తాడు అనే విషయాలు చెప్పబడ్డాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 02:34 PM IST
Zodiac Nature: మీ రాశిని బట్టి మీరు ఖర్చు చేసేవారా లేదా పిసినారి వారా చెప్పేయవచ్చు!

Personality by Zodiac Sign in Telugu: అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తులు విభిన్న స్వభావం కలిగి ఉంటారు. జీవితం పట్ల వారి వైఖరి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ వైఖరి డబ్బు పట్ల వారి నిర్వహణను కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక దృక్కోణంలో జీవించే విషయమైతే, కొంతమంది చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు, మరికొందరు చాలా పొదుపుగా ఉంటారు. వీరు ప్రతి రూపాయిను ప్రణాళిక ప్రకారం ఖర్చు చేస్తారు.  ప్రతి రాశికి చెందిన వ్యక్తుల డబ్బును నిర్వహించే మార్గాలను తెలుసుకుందాం.

మేషం (Aries)- ఈ రాశిచక్రం అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది, కాబట్టి ఈ రాశులవారు డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు. అలాంటి వ్యక్తులు డబ్బును పొదుపు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. 

వృషభం (Taurus)- ఈ రాశిచక్రం భూమి మూలకాన్ని సూచిస్తుంది. వీరు ట్రెండీగా ఉండటానికి ఇష్టపడతారు. డబ్బు ఆదా చేయరు. ఇష్టమెుచ్చినట్లు ఖర్చుపెడతారు.  

మిథునం (Gemini) - స్వతహాగా ఈ రాశికి చెందిన వ్యక్తులు డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే వీరు ప్రణాళికాబద్ధంగా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. అంటే వారు మొదట ఎంత ఖర్చు చేయాలి అని ప్లాన్ చేసి, ఆపై తదనుగుణంగా ఖర్చు చేస్తారు.

కర్కాటక రాశి (Cancer)- ఈ రాశి వారు కూడా డబ్బు ఇష్టమెుచ్చినట్లు ఖర్చుపెడతారు. రాయల్టీ కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు.  

సింహం (Leo)- సింహ రాశి వ్యక్తులు ఉదార స్వభావులు.  భారీగా డబ్బు ఖర్చు చేయవచ్చు. వీరికి మనీ ఆదా చేయాలనే ఆలోచనే చాలా తక్కువగా ఉంటుంది. 

కన్య రాశి (Virgo)- ఈ రాశి వ్యక్తులు దుబారా చేయడానికి ఇష్టపడరు. వీరు డబ్బును సరిగ్గా ఉపయోగించాలనుకుంటారు.

తుల రాశి (Libra)- వీరు బ్యాలెన్సింగ్ ఖర్చు చేస్తారు. వారు అవసరానికి అనుగుణంగా ఖర్చు చేస్తారు. 

వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారు ధనవంతులు. వీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే... వారి నుంచి వసూలు చేయడంలో చాలా కఠినంగా ఉంటారు. వారు అన్ని పనులను సమయానికి చేయడం, సౌకర్యవంతంగా మరియు విలాసంగా డబ్బు ఖర్చు చేయడం ఇష్టపడతారు.

ధనుస్సు రాశి (Sagittarius)- ఈ రాశి వారు డబ్బు గురించి పెద్దగా పట్టించుకోరు. పర్స్ చూడకుండా మూడ్ వచ్చినప్పుడల్లా ఎక్కడికెళ్లినా ఖర్చు పెడుతుంటారు.

మకరం (Capicron)- ఈ రాశి వారికి రాచరికపు ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారు వాస్తవంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి వారు తమ డబ్బును ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తారని నమ్ముతారు.

కుంభం (Aquarius)- ఈ వ్యక్తులు డబ్బు విషయంలో చాలా ఆలోచిస్తారు. ప్లాన్ చేసి ఖర్చు పెడతారు.  మనీ మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానంలో ఉంటారు.

మీనం (Pisces): ఈ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు ఆదర్శవాదులు. వీరు పెద్దగా డబ్బు ఆదా చేయరు. అయినప్పటికీ డబ్బు నిర్వహణ సానుకూలంగా ఉంటుంది. 

Also Read: Money Dreams: కలలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీ లైఫ్ టర్న్ అయినట్లే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News