Astrology Tips: కుండలిలో వివిధ రకాల యోగములు, ప్రత్యేక మహత్యమున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం యోగముల్లో భద్రయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ విశేషాలేంటో చూద్దాం..
జ్యోతిష్యశాస్త్రంలో ఏ వ్యక్తి కుండలిలోనైనా..పంచ మహా పురుష యోగాల మహత్యముంటుంది. ఎవరైనా వ్యక్తి కుండలిలో బుద, మంగళ, గురు, శుక్ర, శని గ్రహాల కారణంగా ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ జాతకం కలిగిన వ్యక్తులకు అన్ని రకాల సౌకర్యాలు పొందడమే కాకుండా ఆనందంగా జీవిస్తారు. ఏ పనైనా చేయగలరు. ఆ వివరాలు తెలుసుకుందాం..
కుండలిలోని ప్రధమ, నాలుగవ, ఏడవ, పదవ భావాల్లో బుధుడు స్వయంగా మిధున లేదా కన్యారాశిలో ఉంటాడు. ఈ సందర్బంగా భద్రయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహాన్ని బుద్ది, జ్ఞానం, ఫిట్నెస్, వివిధ రంగాల్లో సామర్ద్యానికి ప్రతీకగా భావిస్తారు.
భద్రయోగంలో పుట్టినవారి జాతకం
భద్రయోగంలో పుట్టినవారు తక్కువ వయస్సులోనే వ్యవహారాలు చేయడంలో దిట్టగా, అదృష్టవంతులుగా, సుఖవంతంగా ఉంటారు. భద్రయోగంలో పుట్టిన వ్యక్తులు సాధారణంగా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరంతా బుద్దిమంతులు, అందంగా మాట్లాడగలిగిన వ్యక్తులు. ఈ యోగంలో పుట్టిన వ్యక్తి తమ పనులు తామే చేసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. వీరిది చిరునవ్వు మనస్తత్వం.
ఈ యోగంలో పుట్టిన వ్యక్తి ఆలోచన సహజంగా, తెలివిగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు చాలా రంగాల్లో తమ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ యోగంలో పుట్టినవ్యక్తులు ఛార్టెడ్ ఎక్కౌంటెంట్లు, క్లర్కులు, ఎడిటర్లు, పబ్లిషర్స్, హాబీ క్లాస్ టీచర్, ప్రొఫెషనల్ స్పీకర్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, క్యాష్ మేనేజర్, ఎక్కౌంట్స్ ఎగ్జిక్యూటివ్, రైటర్‌లుగా స్థిరపడవచ్చు. ఈ జాతకం కలిగిన వ్యక్తులు హార్డ్‌వర్క్ కంటే స్మార్ట్‌వర్క్‌ను నమ్ముతారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook