December Horoscope 2022: ధన రాజయోగం ప్రభావం, డిసెంబర్‌లో ఆ మూడు రాశులకు వద్దన్నా డబ్బు, ఉద్యోగాలు, పదోన్నతులు

December Horoscope 2022: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రయోజకరంగా..మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో 3 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2022, 04:24 PM IST
December Horoscope 2022: ధన రాజయోగం ప్రభావం, డిసెంబర్‌లో ఆ మూడు రాశులకు వద్దన్నా డబ్బు, ఉద్యోగాలు, పదోన్నతులు

మంగళ, శుక్ర గ్రహాలు గోచారం కారణంగా ధన రాజయోగం సంభవిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఫలితంగా 3 రాశులకు అంతులేని డబ్బు వచ్చి పడుతుంది. మరోవైపు ఈ మూడు రాశుల ప్రేమికులకు అంతా కలిసొస్తుందంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం గోచారం చేస్తుంటుంది. ఫలితంగా 12 రాశులపై ఆ ప్రభావం పడుతుంది. ఈ మధ్యన నవంబర్ 13వ తేదీన మంగళగ్రహం వృషభరాశిలో ప్రవేశించడం, శుక్రగ్రహం వృశ్చకరాశిలో ప్రవేశించడం జరిగింది. ఇలా మంగళ, శుక్ర గ్రహాల గురురాశి వృషభంలో, శుక్రగ్రహం గురురాశి వృశ్చికంలో ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో 3 రాశుల జాతకులకు అద్భుతమైన ధన లాభం కలుగుతుంది.

ధన రాజయోగంతో ఈ రాశులకు లాభాలు

వృషభరాశి

ధన రాజయోగం కారణంగా వృషభ రాశివారికి చాలా లాభం కలగనుంది. సాహసం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. త్వరగా ఆకకర్షింపబడతారు. ఇతరుల్ని చాలా సులంభంగా ఆకర్షించగలుగుతారు. గ్లామర్, మీడియాకు చెందిన వ్యక్తులకు లాభం కలుగుతుంది. పనుల్లో సాఫల్యం లభిస్తుంది. గుడ్‌న్యూస్ వింటారు.

ధనస్సురాశి

ధన రాజయోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అపారమైన లాభం కలుగుతుంది. మంగళ, శుక్రగ్రహాలు రెండూ ధనస్సు రాశివారికి ఊహించని లాభాలు కలగజేస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. పదోన్నతి లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి మంచి జరుగుతుంది. పెళ్లి కానివారికి పెళ్లవుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ధన రాజయోగం లాభాలు ఆర్జిస్తుంది. కెరీర్ పరంగా చాలా అనువైనే సమయం. డబ్బులు, పదవులు, గౌరవం మూడూ లభిస్తాయి. పెళ్లి కానివారికి పెళ్లవుతుంది. వ్యాపారం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.

Also read: Shani Dev: ఒకే రాశిలో మూడు గ్రహాలు.. దీంతో శని బలపడబోతున్నాడు.. ఇక ఆ రాశువారికి డబ్బే.. డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News