Chaturgraha yogam 2023: రాశుల పరివర్తనం సందర్భంగా ఒక్కోసారి కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ యోగాలు ఏర్పడినప్పుడు మాత్రం కొన్ని రాశులవారికి అత్యంత శుభప్రదంగా లేదా దుర్దశగా ఉంటుంది. అధికశాతం కేసుల్లో మహర్దశ పట్టుకోవడం గమనించవచ్చు. మేష రాశిలో ఏర్పడుతున్న చతుర్గ్రహాల యోగం అలాంటిదే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హిందూ పంచాంగం ప్రకారం మేష రాశిలో నాలుగు గ్రహాలు కలిసి యోగం ఏర్పర్చనున్నాయి. దీని ప్రభావం 12 రాశులపై పడుతున్నా ముఖ్యంగా 4 రాశులవారికి మాత్రం అదృష్టం వెంటాడి మరీ ఇస్తుంది. ప్రస్తుతం మంగల గ్రహం రాశిగా పిలిచే మేష రాశిలో రాహువు, గురుడు, బుధ గ్రహాలున్నాయి. చంద్రుడు కర్కాటక రాశిలో గోచారం చేస్తున్నాడు. నాలుగు గ్రహాల కలయికతో చతుర్గ్రహ యోగం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం ఇది అత్యంత శుభప్రదం. చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో అదృష్టం మీకు వద్దంటే కూడా తోడుగా ఉంటుంది.
జ్యోతిష్యంలో చతుర్గ్రహ యోగానికి విశేష ప్రాధాన్యత ఉంది. మకర రాశి జాతకులకు ఈ యోగం ఊహించని లాభాల్ని ఇస్తుంది. వ్యాపారస్థులకు పెద్దఎత్తున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు మంచి పరిణామాలుంటాయి. అందరూ మీ పనితీరుని ప్రశంసిస్తారు. డబ్బులకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి జాతకులకు ఈ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. అంటే ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. రాని డబ్బులు కూడా వసూలవుతాయి.
చతుర్గ్రహ యోగం ప్రభావంతో మీన రాశి జాతకులకు అదృష్టం మహర్దశ పట్టినట్టే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో అనువైన సమయం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుుంది. పెట్టుబడులు లాభాలు ఆర్జించడంతో ధనవర్షం కురుస్తుంది.
చతుర్గ్రహ యోగం ప్రభావం వృశ్చిక రాశి జాతకంపై చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపే పరిస్థితి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా మంచి వాతావరణం ఉంటుంది. వ్యాపారం విస్తృతమై ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన సమస్యలుండవు.
Also read: Budh Gochar 2023: జూన్‌లో బుధుడి సంచారం.. ఈ 2 రాశులపై ప్రతికూల ప్రభావం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook