New Year 2024 Zodiac Signs: కొత్త ఏడాది ఏ రాశి జాతకం ఎలా ఉంటుంది, ఈ రాశులకు మహర్దశే

New Year 2024 Zodiac Signs: హిందూ పంచాంగం ప్రకారం కొత్త ఏడాది కాకపోయినా ప్రపంచమంతా అనుసరించే క్యాలెండర్ ఇదే. అందుకే కొత్త ఏడాది ప్రారంభమౌతూనే ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2024, 08:29 AM IST
New Year 2024 Zodiac Signs: కొత్త ఏడాది ఏ రాశి జాతకం ఎలా ఉంటుంది, ఈ రాశులకు మహర్దశే

New Year 2024 Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాది 2024 లో కొన్ని రాశులకు చాలా అద్భుతంగా ఉండనుంది. మొదటి రోజు నుంచే కనకవర్షం కురుస్తుందంటారు. ముఖ్యంగా శని, గురు, శుక్ర గ్రహాల యోగం కారణంగా కొన్ని రాశులకు అత్యంత ప్రయోజనం కలగనుంది. 

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2024 గత ఏడాది 2023తో పోలిస్తే చాలా బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభమే 4 కీలకమైన అత్యంత శుభంగా భావించే యోగాలతో జరగనుంది. జనవరి 1వ తేదీ 2024 అంటే ఇవాళ ఆయుష్మాన్ యోగం, ఆదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. కొత్త ఏడాదిలో ఏ రాశి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

మకర రాశి జాతకులకు కెరీర్‌పరంగా ఎదుగుదల ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. నలుగురిలో మీకు ప్రత్యేక స్థానముంటుంది. ఖర్చులు పెరిగే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉంటే మంచిది. 

మీన రాశి జాతకులకు ఈ ఏడాది కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్‌పరంగా విద్యార్ధులు, ఉద్యోగులకు సవాళ్లు ఎదురౌతాయి. ఆత్మ విశ్వాసంతో అన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. అప్పుడే విజయం సిద్ధిస్తుంది. 

ధనస్సు రాశి జాతకులకు కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. అందుకు అవసరమైన మార్గాలు కూడా తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడవచ్చు. మీ నాయకత్వ లక్షణాలను అందరూ ప్రశంసిస్తారు. సుఖ సంతోషాలు కలుగుతాయి. జీవితంలో ఏమైనా లోటుపాట్లుంటే దూరమౌతాయి.

మేష రాశి జాతకులకు ఈ సమయం అనుకూలమైంది. అన్ని సవ్యంగా జరుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ కోసం పెట్టుబడులు ప్లానింగ్ చేస్తే మంచి ఫలితాలుండవచ్చు. మీరు కోరుకున్నవి జరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తుల రాశి జాతకులకు ఈ సమయం అనుకూలమైంది. అనుకున్నది సాధించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు దూరమౌతాయి., కీలకమైన పదవులు, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. కలలు సాకారమౌతాయి. ఖర్చులు పెరుగుతాయి. అందుకు తగ్గట్టే ఆదాయం కూడా పెరగనుండటంతో ఆందోళన అవసరం లేదు. 

వృశ్చిక రాశి జాతకులకు ఇది అనుకూలమైన సమయం. అన్నీ సానుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ మార్పు ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అందరి సహకారంతో విజయం సాధిస్తారు. అయితే ఖర్చులు మాత్రం నియంత్రించుకోవల్సి ఉంటుంది. 

వృషభ రాశి జాతకులకు జీవితంలో ఊహించని లాభాలుంటాయి. వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉండవచ్చు. ఇంట్లో, బయటా అన్నింటా సంతోషం లభిస్తుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. ఏ విషయంలోనూ లోటు ఉండదు.

కన్యా రాశి జాతకులకు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఎమోషనల్ కాకుండా చూసుకోవాలి. అంటే మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గతాన్ని మర్చి ముందుకుసాగాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి జాతకులకు కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అన్నీ సానుకూల పరిణామాలే ఎదురౌతాయి. మీ లక్ష్యాల్ని సాధించేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదృష్టం తోడవడంతో ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. 

సింహ రాశి జాతకులు జీవితంలో ఎగుడు దిగుడులు చవిచూస్తారు. కెరీర్‌పరంగా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. 

మిధున రాశి జాతకులకు కుటుంబ జీవితంలో ఆనందం లభిస్తుంది. మీ ఎదుగుదల క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు దూరమౌతాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రతి రంగంలో విజయం లభిస్తుంది. ఆర్దికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. 

Also read: HNY 2024 Wishes: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, గ్రీటింగ్స్, వాట్సప్ మెస్సేజెస్, క్వొటేషన్స్ మీ కోసం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News