Shukra Rahu Yuti 2023: మేష రాశిలో రాహు-శుక్ర కూటమి.. ఈ 3 రాశుల వారి అన్ని కోరికలు నెరవేరుతాయి! ప్రేమలో సక్సెస్

Aries, Capricorn and Gemini signs will Success in love. మేష రాశిలో రాహు, శుక్రుల కలయిక ఏర్పడింది. అన్ని రాశుల వారు ఈ రాహు-శుక్ర సంయోగ ఫలితాన్ని పొందుతారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 13, 2023, 05:24 PM IST
  • మేష రాశిలో రాహు-శుక్ర కూటమి
  • ఈ 3 రాశుల వారి అన్ని కోరికలు నెరవేరుతాయి
  • ప్రేమలో సక్సెస్
Shukra Rahu Yuti 2023: మేష రాశిలో రాహు-శుక్ర కూటమి.. ఈ 3 రాశుల వారి అన్ని కోరికలు నెరవేరుతాయి! ప్రేమలో సక్సెస్

Aries, Capricorn and Gemini signs will Success in love: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. 2023 మార్చి 12న శుక్ర గ్రహం మేష రాశిలోకి ప్రవేశించింది. మేష రాశిలో ఇప్పటికే రాహు గ్రహం ఉంది. దాంతో మేష రాశిలో రాహు, శుక్రుల కలయిక ఏర్పడింది. అన్ని రాశుల వారు ఈ రాహు-శుక్ర సంయోగ ఫలితాన్ని పొందుతారు. శుక్రుడు మరియు రాహువు కలయిక కొన్ని రాశులకు శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాహు-శుక్ర కూటమి 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శుక్ర సంచారం ద్వారా ఏర్పడిన ఈ సంయోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేషం: 
రాహువు మరియు శుక్ర గ్రహల కలయిక మేష రాశిలో జరుగుతోంది. ఇది మేష రాశికి చెందిన ప్రజలపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి వారి స్థానికులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. వృత్తిలో లాభాలు ఉంటాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సక్సెస్ ఉంటుంది.

మకరం: 
రాహువు మరియు శుక్రుల కలయిక మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కూటమి మకర రాశి వారి జీవితంలో భౌతిక ఆనందాన్ని పెంచుతుంది. కొత్త ఇల్లు, కారు లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కోరికలు ఏవైనా ఈ సమయంలో నెరవేరుతాయి. ఆదాయం భారీగా పెరగవచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను అందుకుంటారు. వ్యాపారస్తులకు ధనం లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.

మిథునం:
రాహువు, శుక్రుల కలయిక మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మిథున రాశి వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాలలో భారీ లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు పెద్ద ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. పాత పెట్టుబడి నుంచి లాభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.

Also Read: Black King Cobra Viral Video: అది పామా లేదా పిప్పరపట్టా.. 16 అడుగుల బ్లాక్ కింగ్‌ కోబ్రాను అంత ఈజీగా పట్టాడు!  

Also Read: IND vs AUS 4th Test: భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు డ్రా.. 2-1తో టీమిండియాదే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ! డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News