Akshaya Tritiya Date And Time 2023: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. సంస్కృతంలో అక్షయ అంటే 'శాశ్వతమైన, అంతులేని ఆనందం, విజయమని పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా కొనుగోలు చేస్తే ఐశ్వర్యం లభించడమేకాకుండా లాభాలు కూడా కలుగుతాయి. భారతీయులు ఈ రోజు శ్రీ మహా విష్ణువుడికి పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం..త్రేతాయుగం అక్షయ తృతీయ ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ తిథి, శుభ గడియలు:
మాసం శుక్ల పక్షం తృతీయ తిథి:
ఏప్రిల్ 22 శనివారం 07:49 ఉదయం ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 23 ఆదివారం ఉదయం 07:47 గంటలకు ముగుస్తుంది.
అక్షయ తృతీయ పూజ ముహూర్త:
22 ఏప్రిల్ 2023 ఉదయం 07:49 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు శుభ సమయం.
మొత్తం పూజ వ్యవధి: 04 గంటలు 31 నిమిషాలు
బంగారం కొనడానికి శుభ సమయం:
22 ఏప్రిల్ శనివారం ఉదయం 07:49
23 ఏప్రిల్ ఆదివారం ఉదయం 07:47
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
శాస్త్రం ప్రకారం..అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు అవతరించారు. ఇక ఇప్పటి నుంచే త్రేతాయుగం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన అన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు గంగాస్నానాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజు నది స్నానాలు చేయడం వల్ల చాలా అన్ని రకాల దుష్ప్రభావాలు నశించడమేకాకుండా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బియ్యం, పాలు ఇతర వస్తువులను దానం చేయడం కూడా ఆనవాయితిగా వస్తోంది.
అక్షయ తృతీయ ఉపవాసాలు, పూజా విధానం:
ఈ రోజు ఉపవాసాలు పాటించేవారు తప్పకుండా ఉదయం స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.
విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి..తులసి, పసుపు పూల మాల సమర్పించాల్సి ఉంటుంది.
పూజా కార్యక్రమంలో భాగంగా నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
విష్ణు పూజలో తప్పకుండా విష్ణు చాలీసా పఠించాలి.
Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook