Rasi Phalalu Telugu: 2024లో కుంభరాశితో సహా 4 రాశివారికి లాభాలే లాభాలు..

Eroju Rasi Phalalu: 2024 సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురుగ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు రావడమే కాకుండా భవిష్యత్తులో విజయాలు పొందేందుకు అనుకూల ప్రభావం కూడా లభిస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 08:54 AM IST
Rasi Phalalu Telugu: 2024లో కుంభరాశితో సహా 4 రాశివారికి లాభాలే లాభాలు..

 

Rasi Phalalu Telugu: త్వరలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరంలో కొన్ని అతిపెద్ద గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాలు వ్యక్తిల జాతకంలో శుభ స్థానంలో ఉంటే కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురుగ్రహం 2024 సంవత్సరంలో రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానం, సంపద, వివాహంతో పాటు సంతానానికి సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం ధనస్సు రాశి తో పాటు మీనరాశులకు అధిపతిగా వ్యవహరిస్తుంది. కొత్త సంవత్సరంలో జరగబోయే గురుగ్రహ సంచారం కెరీర్ అదృష్టాన్ని, శ్రేయస్సును కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే 2024 సంవత్సరంలో ఏయే రాశుల వారికి అదృష్టం వారించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: 
2024 సంవత్సరంలో గురుగ్రహం చేయబోయే సంచారం కారణంగా మేష రాశి వారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వృద్దిపరంగా దూసుకు వెళ్తారు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసులో కష్టపడి పని చేయడం కారణంగా గొప్ప అవకాశాలు పొందుతారు అంతేకాకుండా వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రీయ నిబంధనలు చెబుతున్నారు. 

ధనస్సు రాశి:
కొత్త సంవత్సరంలో జరగబోయే గురు గ్రహ సంచారం ధనస్సు రాశి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌తో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ధనస్సు రాశి వారికి రాశితో పాటు నక్షత్రం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సులభంగా లభిస్తాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కుంభరాశి:
కుంభ రాశి వారికి కూడా రాబోయే 2024 వ సంవత్సరం లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గురుగ్రహ సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఇంతకుముందు ఎప్పుడు పొందలేనంత ధనాన్ని పొందుతారు. ఉద్యోగాలు చేసేవారి కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

సింహరాశి:
సింహ రాశి వారికి 2024 సంవత్సరంలో గురు గ్రహ సంచారం 10వ స్థానంలో జరగబోతుంది. దీని కారణంగా కెరీర్ లో ఊహించని విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే..కాకుండా ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక వృత్తి జీవితం గడుపుతున్న వారికి సులభంగా ఎదుగుతారు. ఆర్థికంగా కూడా ఈరే సింహ రాశి వారికి ఎలాంటిదోక ఉండదు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News