Zomato Delivery Boy Eating Food: ఇది గుండెల్ని పిండేసే సన్నివేశం.. ' ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియని వాళ్లకు.. అది ఇలా ఉంటుంది ' అని చూపించేందుకు ఒక దృశ్యరూపం. పొట్ట కూటి కోసం ఓవైపు నలుగురి ఆకలి తీర్చే జొమాటో డెలివరి బాయ్‌గా పనిచేస్తూనే .. మరోవైపు తనకు దొరికిన కొద్దిపాటి సమయంలో బ్రేక్ తీసుకుని తన ఆకలిని తీర్చుకునేందుకు ఓ యువకుడు అనుభవిస్తోన్న వేదనకు ప్రత్యక్ష్య సాక్ష్యం.. అవును.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ఇది.
ఈ వీడియోలో ఒక యువకుడు తన బైకుని పక్కనే నిలిపి.. ఆ బైకుపైనే తను తన వెంట తెచ్చుకున్న ఆహారం పొట్లం విప్పి ఆకలి తీర్చుకోవడం కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకం ఏముంది.. ఇందులో గొప్ప ఏం ఉంది అనిపించవచ్చు.. కానీ ఆ యువకుడు తింటున్న ఆహారం వైపు, అతడి ముఖంలో ఆదుర్ధాను నిశితంగా పరిశీలించి చూస్తేనే అసలు విషయం బోధపడుతుంది.
इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023
అవును.. మీరు చూసింది నిజమే.. అతడు తింటున్న ఆహారం పార్సిల్ హోటల్లో పార్సిల్ చేసింది కాదు.. తను వెంట తెచ్చుకున్నాడా లేక ఎవరైనా ఇచ్చారా అనే సమాచారం అయితే లేదు కానీ అది ఒక పాలిథిన్ కవర్లో పెట్టి ఉంది. ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఆ ఆహారాన్ని యువకుడు ఆకలితో తింటున్నాడు. అతడు తినే సమయంలో అతడి ముఖంలో హావాభావాలను గమనించారా ? ఏదో తెలియని ఆందోళన.. ఏదో కంటికి కనపడని ఆదుర్దా ఆ యువకుడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సమయం లేనట్టుగా.. ఎవరో వెంటపడి తరుముతున్నట్టుగా అతడు టెన్షన్ పడుతుండటం అర్థం అవుతోంది.
ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరన్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. '' ఇలాంటి వాతావరణంలో కస్టమర్లకు ఫుడ్ డెలివరి చేస్తోన్న ఈ డెలివరి బాయ్స్ గురించి కూడా కొంచెం ఆలోచించండి " అని క్యాప్షన్ రాసుకొచ్చారు. దాదాపు 10 వేలకు పైగా నెటిజెన్స్ ఆ వీడియోను లైక్ చేసి కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
I always make sure to offer a packet of biscuits / some fruit, / milk sharbat depending on what I have handy that time to any delivery guy who comes to deliver at my doorstep.. their smiles are priceless
— Modest Heroes🇮🇳 (@LittleB83539051) June 20, 2023
ఒక ట్విటర్ యూజర్ ఈ ట్వీట్‌కి స్పందిస్తూ.. తనకు ఫుడ్ డెలివరి చేయడానికి వచ్చే డెలివరి బాయ్స్‌కి బిస్కెట్ ప్యాకెట్ / పండ్లు / శర్బత్ .. ఇలా తన వద్ద ఆ సమయంలో ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చి పంపిస్తుంటాను అని పేర్కొన్నారు.
In order to get our food delivered on time, they often remain hungry or skip their meals. It's a sad reality and these scenes are heart touching 🥺😔😪#NotAllHeroesWearCapes#empathy #compassion
— Mainak Mukherjee (@MainakM90) June 20, 2023
ఇది కూడా చదవండి : Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు!
ట్విటర్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మైనక్ ముఖర్జీ అనే మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. " మనకు సమయానికి ఫుడ్ అందివ్వడం కోసం వారు తిండితిప్పలు లేకుండా కడుపు మాడ్చుకుని, ఆకలిని దిగమింగుకుని పనిచేస్తుంటారు. వాళ్లు అలాంటి పరిస్థితుల్లో పనిచేయడం అనేది చాలా బాధకరం. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. నిజంగా ఇది హార్ట్ టచింగ్ వీడియో.. హార్ట్ టచింగ్ మూమెంట్.. ఒక పేదోడి ఆకలి బాధకు దృశ్యరూపం. ఈ కథనం చదివాకా, ఈ వీడియో చూశాకా మీకు ఏం అనిపించిందో మీ అభిప్రాయాన్ని కథనం కింద కామెంట్స్ రూపంలో వెల్లడించండి.
ఇది కూడా చదవండి : King Cobra in Car Dicky: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. పట్టుకోవాలని చూసిన సాహెబ్ కు తడిపించేసిన స్నేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK