Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?

Why Birds Don't Get Electrical Shock: మనిషికి విద్యుత్ తీగ తగిలితే క్షణాల్లోనే విద్యుత్ షాక్ తగులుతుంది.. మరి పక్షుల విషయంలో అలా ఎందుకు జరగదు అనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది కదా ? అయితే, విద్యుత్ తీగలపై ఉయ్యాల ఊగే పక్షులకు విద్యుత్ షాక్ తగలకపోవడానికి వెనుకున్న సైన్స్ ఏంటి అనేది మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. అదేంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.

Written by - Pavan | Last Updated : Feb 11, 2023, 08:07 PM IST
Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?

Why Birds Don't Get Electrical Shock: పక్షులు తీగలపై వాలడం చూసే ఉంటారు కదా.. పక్షులు అలా విద్యుత్ తీగలపై వాలినప్పుడు వాటికి ఎందుకు కరెంట్ షాక్ తగలదు అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా ? మనిషికి విద్యుత్ తీగ తగిలితే క్షణాల్లోనే విద్యుత్ షాక్ తగులుతుంది.. మరి పక్షుల విషయంలో అలా ఎందుకు జరగదు అనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది కదా ? అయితే, విద్యుత్ తీగలపై ఉయ్యాల ఊగే పక్షులకు విద్యుత్ షాక్ తగలకపోవడానికి వెనుకున్న సైన్స్ ఏంటి అనేది మాత్రం చాలా కొద్దిమందికే తెలుసు. అదేంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడాల్సిందే.

ప్రతీ జీవికి ప్రకృతిని ఎదుర్కొని నిలిచేలా దేవుడు ఏదో గొప్ప శక్తిని ఇస్తుంటాడు అంటుంటారు కదా.. పక్షుల విషయంలో కూడా అలాంటి అద్భుతమే కనిపిస్తుంది. సహజంగానే పక్షుల పాదాలు, ఈకల నుంచి విద్యుత్ ప్రవహించకుండా ఎలక్ట్రికల్ రెసిస్టన్స్ సిస్టం ఉంటుంది. అంటే పక్షుల పాదాలు, ఈకల నుంచి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం చాలా అంటే చాలా తక్కువన్న మాట. ఈ కారణంగానే పక్షులకు విద్యుత్ షాక్ తగిలే అవకాశం లేకుండాపోయింది.  

పక్షులకు విద్యుత్ షాక్ తగలకపోవడానికి మరో కారణం రెండు విద్యుత్ తీగల మధ్య ఉండే దూరం. రెండు విద్యుత్ తీగల మధ్య ప్రవహించే విద్యుత్ వలయం పక్షులను చేరకపోవటం అనేది దీని మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. పక్షులు ఒక తీగపై నిలబడినప్పుడు దాని తోక మరో తీగకు తగిలిన సందర్భాల్లోనే అవి విద్యుత్ షాక్ బారిన పడుతుంటాయి. లేదంట్ అవి విద్యుత్ షాక్ నుంచి సేఫ్ అనే అనుకోవచ్చు. డైరెక్ట్ కరెంట్ ప్రవహించే విద్యుత్ తీగతో పోల్చితే.. ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రవహించే విద్యుత్ తీగతో ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. ఇది పక్షిని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఏసీ తీగలో విద్యుత్ ప్రవహించే దిశ క్షణానికి ఒక రకంగా మారుతుంది. కానీ డైరెక్ట్ కరెంట్ విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో ఉంటుంది. ఏసీ తీగతో పోల్చితే ఇది ప్రమాదకరం. 

ఇక మానవుల విషయానికొస్తే.. నేరుగా నేలపై నిలబడిన మనిషికి విద్యుత్ షాక్ తగిలితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో విద్యుత్‌తో ఏదైనా పనులు చేసే సమయంలో ప్లాస్టిక్ చెప్పులు ధరించడం మంచిది. ప్లాస్టిక్ పదార్థంలో విద్యుత్ ప్రవాహం జరగదు. ఈ కారణంగానే దానిని బ్యాడ్ కండక్టర్ అని అంటారు. ప్లాస్టిక్ చెప్పులు విద్యుత్ ప్రవాహాన్ని కాళ్ల కింద నుంచి నేలకు పాస్ అవకుండా ఆపడం వల్ల విద్యుత్ షాక్ తగిలే రిస్క్ చాలా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్

ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్

ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News