WhatsApp Voice Message Status: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్‌లో వాయిస్ మెసేజ్ పోస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌లో టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. వాట్సాప్ తీసుకొచ్చే ఈ ఫీచర్‌తో యూజర్స్ తమ వాయిస్ మెసేజ్‌ను స్టేటస్‌లో పోస్ట్ చేయవచ్చు.వాయిస్ నోట్స్ ఫీచర్‌తో వాట్సాప్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం వాట్సాప్ చాట్స్‌కి అందుబాటులో ఉన్న వాయిస్ మెసేజ్ ఫీచర్ లాగే ఇది కూడా పనిచేయనుంది. వాయిస్ స్టేటస్‌కి కూడా ప్రైవసీ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే.. మీ ఫ్రెండ్స్ లిస్టులో మీరు ఎంపిక చేసిన కాంటాక్ట్స్‌కి మాత్రమే వాయిస్ మెసేజ్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెక్స్ట్, ఫోటోలు, వీడియో స్టేటస్‌కి ఈ రకమైన ప్రైవసీ ఆప్షన్ అందుబాటులో ఉంది. వాట్సాప్ వాయిస్ నోట్స్ ఫీచర్ ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది త్వరలో క్లారిటీ రావొచ్చు.
ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఆప్షన్‌ని కూడా త్వరలో వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యూజర్స్ 'లాస్ట్ సీన్'ని మాత్రమే హైడ్ చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ సీన్ తరహాలో ఆన్‌లైన్ స్టేటస్‌ని హైడ్ తీసుకునే ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తున్నట్లు WABetaInfo ద్వారా ఇటీవల వెల్లడైంది. యూజర్స్‌కి సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించే ఉద్దేశంతో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Also Read: Godavari Floods LIVE:భద్రాచలం సేఫేనా?మరో నాలుగు గంటలు గడిస్తేనే.. రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook