Blue Aadhaar Card: ఆదార్‌కార్డ్. నిత్యజీవితంలో ఇప్పుడొక భాగమిది. అవసరం ఏదైనా, ఎలాంటిదైనా ఆధార్‌కార్డు తప్పనిసరి. మరి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తోంది ప్రభుత్వం. అదే బ్లూ ఆధార్‌కార్డు. ఆ కార్డు ప్రత్యేకతలేంటో చూద్దాం.
ప్రభుత్వ పథకాలకైనా, బ్యాంకు ఎక్కౌంట్ లేదా పాస్‌పోర్ట్ అవసరం ఏదైనా సరే ఆధార్‌కార్డు కావల్సిందే. యూనిక్ అడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ప్రత్యేక కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూప్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గానే పనిచేయదు. ప్రతి పనికీ ఆధారమైపోతోంది. అందుకే దీన్ని ఆధార్‌కార్డు అని పిలుస్తున్నారు. ఆధార్‌కార్డుతో ఆ వ్యక్తి మొత్తం నేపధ్యం తెలుసుకోవచ్చు. ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ ఆధార్‌కార్డు(Aadhaar Card)తీసుకోవల్సిందే. చిన్నారులకు మాత్రం ప్రత్యేకమైన బాల ఆధార్‌కార్డు జారీ చేస్తోంది యూఐడీఏఐ(UIDAI). చిన్నారులకు జారీ చేసే బాల ఆధార్‌కార్డు కాస్త నీలం రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్‌కార్డుగా పిలుస్తారు. ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధమైన డాక్యుమెంట్లు సమర్పించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూ ఆధార్‌కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలి(How to apply blue aadhaar card)
కేంద్ర ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యేకంగా జారీ చేస్తున్న కార్డు ఇది. నీలం రంగులో ఉండి, సాధారణ ఆధార్‌కార్డుకు కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్‌కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకుంటామో..ఇది కూడా అలానే చేయాలి. ముందుగా ఆదార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో దరఖాస్తుతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్, బర్త్ సర్టిఫికేట్లు జత చేయాల్సి ఉంటుంది. దీనికోసం యూఐడీఏఐ 31 రకాల ఐడీ కార్డులు, 44 రకాల అడ్రస్ ప్రూఫ్,14 రకాల రిలేషన్‌షిప్ ప్రూఫ్, 14 బర్త్ సర్టిఫికేట్లు అంగీకరిస్తుంది.
ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న చిన్నారులకే ఈ కార్డు వర్తిస్తుంది. ఐదేళ్లు దాటితే బాల ఆధార్‌కార్డు(Bala Aadhaar Card) లేదా బ్లూ ఆధార్‌కార్డు పనిచేయదు. ఐదేళ్లు దాటిన తరువాత మరోసారి అప్‌డేట్ చేసుకోవాలి. స్కూల్‌లో ఇచ్చే ఐడీ కార్డుతో అప్‌డేట్ చేసుకోవచ్చు. చిన్నారులకు ఆధార్ కోసం తల్లిదండ్రుల్లో ఒకరి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరణ జరుగుతుంది. ఇక బయోమెట్రిక్ వివరాల్ని 5 ఏళ్లకు, తిరిగి 15 ఏళ్ల వయస్సులో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏ విధమైన రుసుపు చెల్లించాల్సిన అవసరం లేదు. బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌తో బ్లూ ఆధార్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.చిన్నారుల ఆధార్ కార్డులో బయోమెట్రిక్(Biometric update) వివరాలుండవు కాబట్టి..15 ఏళ్ల తరువాత బయోమెట్రిక్ వివరాలతో అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.
Also read: Birthday cake viral video: బర్త్ డే కేక్ కట్ చేయబోతే.. జుట్టుకు నిప్పంటుకున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook