Viral Photo: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! పెళ్లి బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు

Bridegroom and Bride Wedding Banner Photo goes Viral. ఓ బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు ఉన్నాయి. బ్యానర్‌లో బాలాజీ వెడ్స్ రాజ్యలక్ష్మి లేదా పవిత్ర అని రాసుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 08:00 PM IST
  • పెళ్లి బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు
  • ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే
  • ఒక్క వరుడికి ఇద్దరు వధువులేంటి
Viral Photo: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! పెళ్లి బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు

Wedding Banner, One Bridegroom and Two Bride names in Marriage Flexi: ఇటీవలి కాలంలో పెళ్లి తతంగంలో చాలా ట్విస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాళి కట్టే సమయానికి వధువు ఈ మ్యారేజ్ తనకు ఇష్టం లేదంటూ తెగేసి చెప్పడం, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక వరుడు పారిపోవడం లాంటివి మనం తరచుగా వింటున్నాం లేదా చూస్తూనే ఉన్నాం. దాంతో పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు పెద్ద అవమానంగా భావిస్తారు. మరోవైపు పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు పలు రకాలుగా మాట్లాడుకుంటూ నానా హంగామా చేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఓ కుటుంబం ముందస్తు జాగ్రత్తగా ప్లాన్ బీని కూడా సిద్ధంగా ఉంచుకుంది. 

మాములుగా పెళ్లి జరుగుతుందంటే.. వరుడు, వధువుల వివారాలకు సంబంధించిన బ్యానర్, ఫ్లెక్సీలు పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్ ముందు పెడతారు. సాధారణంగా బ్యానర్‌లో వధువు, వరుడి పేర్లు ఉంటాయి. అయితే ఓ బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు ఉన్నాయి. బ్యానర్‌లో బాలాజీ వెడ్స్ రాజ్యలక్ష్మి లేదా పవిత్ర అని రాసుంది. అంటే వరుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకుంటాడన్న మాట. ఓ వధువు హ్యాండ్ ఇస్తే.. ఇంకో వధువుతో పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ముందే ప్లాన్ చేశారని బ్యానర్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.

బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ బ్యానర్ రెండు నెలల క్రితంది. 2022 మార్చి 6న ఈ బ్యానర్‌కు సబంధించిన పెళ్లి జరిగింది. మరి వరుడు బాలాజీ.. రాజ్యలక్ష్మిని చేసుకున్నాడా లేదా పవిత్రను చేసుకున్నాడా అన్నది తెలియరాలేదు. ఏదేమైనా ఈ బ్యానర్ నెట్టింట ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇది చుసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇదేం పెళ్లిరా బాబూ.. ఒక్క వరుడికి ఇద్దరు వధువులేంటి' అని ఇంకొకరు ట్వీటారు. 

Also Read: లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చా: నాగ చైతన్య

Also Read: Beggar Buy Bike: భార్యకు ప్రేమతో.. 90 వేల బైక్‌ కొన్న బిచ్చగాడు! రోజువారీ సంపాదన తెలిస్తే షాకే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News