Viral Video: ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. పరోటాను ఈ రేంజ్ లో ఎవరైనా ఉతుకుతారా?

Kolkata Famous Pitai Paratha: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డిఫరెంట్ గా ఏది చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి పరోటాను తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2024, 07:09 PM IST
Viral Video: ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. పరోటాను ఈ రేంజ్ లో ఎవరైనా ఉతుకుతారా?

Viral Video today: సోషల్ మీడియాలో పుడ్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ గా కుకింగ్ వీడియోలు చేస్తే లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. మనలో చాలా మంది లగ్జరీ హోటల్స్, రెస్టారెంట్స్ ఎన్ని ఉన్న రోడ్డు పక్కన ఉన్న బండి దగ్గరే తినడానికి ఇష్టపడతాం. మనదేశంలో ఇలాంటి స్టాల్స్ కొకొల్లలుగా ఉన్నాయి. వీరు తక్కువ ధర, మంచి రుచితో టిఫిన్స్, స్నాక్స్ భోజనం అందిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి స్టాల్ లో పరోటాను తయారు చేస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 

వీడియో ఓపెన్ చేస్తే.. కోల్‌కతాలోని ఓ చిన్న స్టాల్ లో ఓ వ్యక్తి పరోటాను తయారు చేస్తూ ఉంటాడు. ఇందులో ఆ వ్యక్తి కాల్చిన పరోటాను తన చేతులతో బట్టలు ఉతికినట్లు ఉతుకుతాడు. చక్కగా ఉన్న పరోటాను తన చేతులతో చితక్కొట్టి ముక్కలు చేస్తాడు. ఆనంతరం ఆ పరోటాను తూకం వేసి అమ్ముతున్నాడు అందులో కుర్మా కూర, కోడి గుడ్డు కూడా ఇస్తున్నారు. ఈ పరోటానే స్థానికంగా ``పిటై పరోటా`` అని పిలుస్తారు. ఈ పరోటా తయారీ విధానం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. 

Also Read: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

ఈ వీడియోను foodie_insaan అన్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా.. మిలియన్స్ లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఈ వీడియోను 2.5 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. అంతేకాకుండా ఈ వీడియోపై కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. బట్టలు ఉతకాల్సిన వాడు పరోటా చేస్తున్నాడు అని ఒకరంటే.. పరోటా మీద తన కసి చూపిస్తున్నాడు అని మరోకరు కామెంట్ చేశారు. 

Also read: OMG video: పెద్ద పులితో పరాచకాలు ఆడిన కుక్క.. చివరకు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News