Ratan Tata Simplicity : నిరాడంబరతకు, మానవత్వానికి పెట్టింది పేరు రతన్ టాటా. లక్షల కోట్ల రూపాయాల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ ఆయనలో కించిత్తు గర్వం కనిపించదు. తోటివారి పట్ల ఆయనెప్పుడూ దయాగుణంతో ఉంటారు. దేశానికి ఆపదొస్తే ఎంతైనా విరాళం ఇచ్చేందుకు వెనుకాడరు. అలాంటి టాటా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.
ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి రతన్ టాటా నానో కారులో వచ్చారు. ఆయన పక్కన బాడీగార్డ్స్ కూడా లేరు. ఆ సమయానికి హోటల్ సిబ్బంది వచ్చి టాటాను రిసీవ్ చేసుకున్నారు. సాధారణంగా బిగ్ షాట్స్ ఎక్కడికైనా వస్తున్నారంటే... అక్కడ ఎంత హంగామా ఉంటుందో తెలిసిందే. కానీ టాటా మాత్రం అందుకు భిన్నంగా సింప్లిసిటీనే ఇష్టపడుతారు. తాజా ఘటనతో ఆ విషయం మరోసారి రుజువైందని చెప్పాలి.
టాటా నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయ్యాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. తమ అనుచరుడు బాబా ఖాన్ ఈ వీడియో తీశారని... టాటా సింప్లిసిటీ చూసి అతను ఆశ్చర్యపోయాడని వైరల్ భయ్యాని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.
టాటా సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈరోజుల్లో కాస్త డబ్బుంటేనే చాలామంది కళ్లు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తారని... అలాంటిది ఒక బిలియనీర్ అయి ఉండి టాటా చాలా సింపుల్ లైఫ్ గడుపుతుండటం గ్రేట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాటా సింప్లిసిటీని ఇష్టపడే వ్యక్తే కాదు... సందర్భం వచ్చిన ప్రతీసారి ఇతరులకు సాయం చేయడంలోనూ ముందుంటారు. కోవిడ్ సమయంలో దేశం కోసం ఆయన రూ.1500 కోట్లు విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, తమ సంస్థలో కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 20 నెలల బేసిక్ సాలరీని వన్ టైమ్ పేమెంట్ కింద చెల్లించారు. అంతేకాదు, ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ తేదీ వరకు వారి కుటుంబాలకు ప్రతీ నెలా బేసిక్ సాలరీలో సగం వేతనాన్ని ఇస్తున్నారు. టాటా మనసు ఎంత గొప్పదైతే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. అందుకే టాటా అంటే వ్యాపారవేత్తలందరిలోకి స్పెషల్ అనే చెప్పాలి.
Also Read: KGF 2 Collection: బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న 'కేజీఎఫ్ 2'.. 'బాహుబలి' రికార్డులను కొల్లగొట్టేనా?
Also Read: TRS Rajyasabha Names:పెద్దల సభకు ముగ్గురు వ్యాపారవేత్తలే.. చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook