Ratan Tata : మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రతన్ టాటా.. వైరల్ అవుతోన్న వీడియో!

Video of Ratan Tatas birthday celebration goes viral : రతన్ టాటా బర్త్‌ డేకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మొదట వైభవ్‌ భోయిర్‌ అనే వ్యక్తి లింక్డ్‌ ఇన్‌లో షేర్ చేశారు. తర్వాత వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 06:15 PM IST
  • సింపుల్‌గా బర్త్‌ డే వేడుకలు చేసుకున్న రతన్ టాటా
  • తన 84వ పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిరాడంబ‌రంగా జ‌రుపుకున్న రతన్ టాటా..
  • చిన్న క‌ప్ కేక్‌పై రెండు చిన్న క్యాండిల్స్ తో బర్త్‌ డే
Ratan Tata : మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రతన్ టాటా.. వైరల్ అవుతోన్న వీడియో!

Watch How Ratan Tata celebrated his 84th birthday, Harsh Goenka posts it too : టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) దేశంలోనే అత్యంత దానకర్ణుడిగా పేరొందారు. సాధారణ జీవితం గడిపే రతన్ టాటా చాలా మందికి ఆదర్శం. నిరాడంబ‌ర‌త‌కు నిద‌ర్శ‌నంగా ఉంటారు ఆయన. 

రతన్ టాటా (Ratan Tata) బిలియ‌నీర్ అయినప్పటికీ ఎంతో సింప్లిసిటీతో (Simplicity) ఉంటారు. రతన్ టాటా ఎక్కువగా సామాన్య జీవితాన్నే ఇష్టపడతారు. రతన్ టాటాకు మాన‌వ‌త్వం.. ద‌యాగుణం ఎక్కువ. మనదేశం కోసం ర‌త‌న్ టాటా చేస్తోన్న సేవా కార్య‌క్ర‌మాలు ఎన్నో ఉన్నాయి. 

అంత పెద్ద బిలియ‌నీర్ అయిన రతన్ టాటా అనుకుంటే తన పుట్టిన రోజు ఎంతో వైభవంగా జరుపుకోవచ్చు. కానీ ఎంతో సింపుల్‌గా బర్త్‌ డే వేడుకలు చేసుకున్నారు రతన్ టాటా. తాజాగా త‌న 84వ పుట్టిన రోజు (84th birthday) వేడుక‌ల‌ను నిరాడంబ‌రంగా జ‌రుపుకున్నారు. ఒక చిన్న క‌ప్ కేక్‌పై (cupcake) రెండు చిన్న క్యాండిల్స్ పెట్టి సింపుల్‌గా బర్త్‌ డే జరుపుకున్నారు. 

రతన్ టాటా బర్త్‌ డేకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మొదట వైభవ్‌ భోయిర్‌ (Vaibhav Bhoir) అనే వ్యక్తి లింక్డ్‌ ఇన్‌లో షేర్ చేశారు. తర్వాత వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో వైరల్ అవుతోంది. తన అసిస్టెంట్ శంతను నాయుడుతో కలిసి రతన్ టాటా ఈ పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు.

Also Read : ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో పోస్టర్.. చరణ్ గెటప్ పోలా అదిరిపోలా! 9 గంటలకు ఇంకో అప్‌డేట్!

రతన్‌ టాటా సింప్లిసిటీని మెచ్చుకుంటూ ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా కూడా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. చాలా మంది నెటిజెన్స్ రతన్ టాటాపై (Ratan Tata) పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంత పెద్ద కోటీశ్వరుడు.. ఇంత సింపుల్‌గా (Simple) ఉండడం నిజంగా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.

 

Also Read : Vishwak Sen Corona: హీరో విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకిన వైరస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News