Virat Anushka: విరాట్ కోహ్లికి ఏమైందబ్బా.. ఇంత మూడీగా, చిరాగ్గా ఎప్పుడూ చూసుండరు..

Virat Kohli Anushka Latest Video: ఇటీవల అనుష్కతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విరాట్ కోహ్లి చాలా మూడీగా, చిరాగ్గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 2, 2022, 12:37 PM IST
  • విరాట్ అనుష్క లేటెస్ట్ వీడియో
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • మూడీగా, చిరాగ్గా కనిపించిన విరాట్
Virat Anushka: విరాట్ కోహ్లికి ఏమైందబ్బా.. ఇంత మూడీగా, చిరాగ్గా ఎప్పుడూ చూసుండరు..

Virat Kohli Anushka Latest Video: సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఒక్క ఫోటో అంటూ ఫ్యాన్స్ వెంటపడటం కామన్. అలాగే, ఫోటోగ్రాఫర్లు సర్ జీ, మేడమ్ జీ ఒక్క ఫోటో అంటూ ఇబ్బందిపెట్టేస్తుంటారు. కొన్నిసార్లు మూడ్ సరిగా లేకపోయినా సరే  ఓపికగా ఫోటోలకు పోజులు ఇవ్వాల్సిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ముంబై ఎయిర్‌పోర్టులో అనుష్కతో కలిసి కనిపించిన విరాట్ కోహ్లిని ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టేశారు. ఒక్క ఫోటో అంటూ కెమెరాలకు పనిచెప్పారు.దీంతో విరాట్ అనుష్కతో కలిసి అయిష్టంగానే ఫోటోలకు పోజులిచ్చాడు.

కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే అతను ఫోటోలకు పోజులిచ్చే మూడ్‌లో లేడని అర్థమవుతోంది. అయినప్పటికీ తప్పదు కాబట్టి ఏదో బలవంతంగా నవ్వినట్లు ఫోటోలకు పోజులిచ్చాడు. చివరలో, అక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఫోటోగ్రాఫర్స్ వైపు సీరియస్‌గా ఓ లుక్ ఇచ్చాడు. కోహ్లికి ఏమైందబ్బా.. ఇంత చిరాగ్గా, కోపంగా కనిపిస్తున్నాడంటూ వీడియో చూసిన నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ భయానీ ఇన్‌స్టా ఖాతా ద్వారా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకి ఇప్పటివరకూ 82 వేల లైక్స్ వచ్చాయి.

కాగా, విండీస్ టూర్‌కు విరాట్ కోహ్లికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యామిలీతో కలిసి యూరోప్ వెకేషన్‌కి వెళ్లి ఇటీవల ఇండియా తిరిగొచ్చాడు. ఇక అనుష్క శర్మ ప్రస్తుతం టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి పాత్రలో చక్‌దే ఎక్స్‌ప్రెస్‌లో సినిమాలో నటిస్తోంది. మరో సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

 

Also Read:పనస పండ్ల కోసం ఏనుగు తిప్పలు.. ఏకంగా చెట్టు ఎక్కి మరీ తెంపిందిగా (వీడియో)

Also Read: Govt Jobs: నిరుద్యోగులకు బిగ్ షాక్.. గ్రూప్ 4 పోస్టుల‌కు గండి!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News