Pet dog emotional while ganesh immersion video viral: వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి.ఈ రోజు దేశ వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమం వేడుకగా కొనసాగుతుంది. గణేష్ ఉత్సవాలలో చిన్నా, పెద్ద తేడాలేకుండా ప్రజలంతా ఫుల్ జోష్ తో పాల్గొంటారు. వినాయకుడి కోసం ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజుల పాటు భక్తితో రోజుకో నైవేద్యం సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గణపయ్య నవరాత్రులు ఎంత గ్రాండ్ గా నిర్వహిస్తారో.. అంతే వేడుకగా నిమజ్జనం కూడా చేస్తుంటారు.
Ganpati Bappa Morya, Agle baras tu jaldi aa🔱 pic.twitter.com/kB8uVpIbro
— Vertigo_Warrior (@VertigoWarrior) September 17, 2024
అయితే.. వినాయక నవరాత్రి వేడుకల తర్వాత ఈరోజు చాలా చోట్ల భారీగా గణపయ్యలను నిమజ్జనం చేస్తున్నారు.చాలా మంది తొమ్మిదిరోజుల పాటు పూజించుకున్న గణపయ్యను నిమజ్జనం చేయాలంటే.. కాస్తంతా భావోద్వేగానికి గురౌతుంటారు. కొంత మంది పిల్లలు కూడా గణపయ్య విగ్రహాం దగ్గర కూర్చుని ఎమోషనల్ అవుతుంటారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయోద్దంటూ కూడా కన్నీళ్లుపెట్టుకుంటారు. అయితే.. ఇప్పుడు మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం.. వినాయుడి నిమజ్జనంను అడ్డుకుని ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
గణేష్ నవరాత్రులంటేనే చాలా మంది ధూమ్ ధామ్ గా నిర్వహించుకుంటారు. తొమ్మిదిరోజుల పాటు ఎంతో భక్తితో పూజలు చేస్తారు. అదే విధంగా నిమజ్జనం కూడా డీజేలు, బ్యాండ్ ల మధ్య గణపయ్యకు గ్రాండ్ గా వీడ్కోలు చెబుతుంటారు. చాలా మంది తమ ఇంట్లో పూజించుకున్న గణేషుడిని నిమజ్జనం చేయమంటే.. ఒకింత భావోద్వేగానికి గురౌతుంటారు.
అయితే.. సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిలో ఒక శునకం తన ఇంట్లోని వినాయకుడిని నిమజ్జనం కోసం తీసుకెళ్తుంటే అడ్డుకుంటుంది. శునకం.. కాళ్ల మీద కూర్చుని, నిలబడి వినాయకుడికి నమస్కరించి, నిమజ్జనంవద్దన్నట్లుగా అడ్డుపడుతుంది.
ఆ ఇంటి యజమానులున గణపయ్యను తీసుకెళ్తుంటే.. అడ్డుగా ఉండిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మనుషులకే కాదు.. శునకాలకు కూడా భావొద్వేగాలుఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.