Dog Chanting Radhe Bhajan: మనలో చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. శునకాన్ని ముఖ్యంగా.. విశ్వాసానికి, ప్రేమకు ప్రతీకగా చెబుతుంటారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో కుక్కను తప్పనిసరిగా పెంచుకుంటారు. దీన్ని ఇంట్లోని మనుషుల్లాగానే ట్రీట్ చేస్తారు. మంచి క్వాలీటీ ఫుడ్ ఇస్తారు. వాకింగ్ కు తీసుకెళ్తుంటారు. వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్తుంటారు.
కుక్కలు కూడా తమ యజమాని పట్ల అంతే విశ్వాసంతో ఉంటుంది. పొరపాటున తమ ఓనర్ ఒక్క కన్పిచకుంటే ఆహారం తినడం కూడా మానేస్తాయి. శునకాలు తమ యజమానుల పట్ల చూపించిన ప్రేమకు సంబంధించిన అనేక వీడియోలు వార్తలలో నిలిచాయి. తాజాగా మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Dog chanting Radhe Radhe :-)pic.twitter.com/SmxB72atbG
— MANISH SHARMA (सुजानगढ़ ) (@ManishBagra) January 26, 2024
పూర్తి వివరాలు.. దేశమంతట ప్రస్తుతం రామనామ స్మరణలో ఉంటుంది. అయోధ్యలో రాముడి విగ్రహం స్థాపించిన తర్వాత చాలా మంది భక్తితో రాములవారిని ఎక్కువగా పూజిస్తున్నారు. దేవుడిమీద నమ్మకం లేని వారు సైతం ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చి భజనలు కూడా చేస్తున్నారంట.
అయితే.. మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం దేవుడి నామ స్మరణతో పులకించిపోతున్నాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక శునకం వైపు చూస్తు దాని యజమాని భక్తితో "రాధే.. రాధే''.. అంటూ భక్తితో భజనలు చేశాడు.
దీన్నిచూసిన శునకం కూడా రెండు కాళ్లను పైకి ఎత్తి "రాధే.. రాధే..'' అని భక్తితో తన ముందు కాళ్లతో భజన చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ... ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు... శునకం చేస్తున్న భజనచూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook