Passengers push Airplane: సాధారణంగా ఏ కారునో, బస్సునో చేతులతో నెట్టడం చూసుంటాం. మరి విమానాన్ని తోయ్యడం ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఈ వీడియో చూసి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఈ వింత వీడియో చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ సంఘటన బుధవారం నేపాల్(Nepal)లోని ఓ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
నేపాల్ కోల్టీలోని బజురా ఎయిర్ పోర్టు( Bajura Airport)లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలింది. దీంతో విమానం(Airplane) రన్‌వే నుంచి టేకాఫ్ కాలేదు. ఇంతలో.. విమానం అడ్డుగా ఉండటంతో మరో విమానం పైకి ఎగరలేకపోయింది. దీంతో విమానాశ్రయం(AirPort)లోని ప్రయాణికులు, భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వే నుంచి అడ్డుతప్పించారు. తారా ఎయిర్ సంస్థ(Tara Airlines)కు చెందిన ఈ విమానాన్ని ప్రయాణికులు నెడుతున్న వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్(Twitter)లో షేర్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw
— Samrat (@PLA_samrat) December 1, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook