వైరల్ వీడియో కథనం: రోడ్డు మీద వెళ్తున్న ట్రక్కులో భారీ మొత్తంలో డాలర్ల కరెన్సీ నోట్లు తీసుకువెళ్తున్నారు. ఉన్నట్టుండి ట్రక్కు డోర్లు తెరుచుకున్నాయి. ట్రక్కులో ఉన్న కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై అనుకోకుండా కురిసిన కరెన్సీ నోట్ల వర్షం చూసి తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. తొలుత అవి ఫేక్ నోట్లు అయ్యుంటాయని భావించిన వాహనదారులు లైట్ తీసుకున్నారు. కానీ కొంతమంది తమ క్యురియాసిటీని ఆపుకోలేక తమ వాహనాలు దిగి కరెన్సీ నోట్లు చేతపట్టుకుని చూసి మరింత షాకయ్యారు. అవి నిజమైన కరెన్సీ నోట్లే. డాలర్లకు డాలర్లు అలా రోడ్డుపై పడిఉండటం చూసి ప్రత్యక్షసాక్షులకు నోట మాట రాలేదు. వెంటనే పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ ఆ నోట్లను రెండు చేతులతో ఏరుకుంటూ భారీ మొత్తంలో ధనం పోగేసుకోసాగారు.
ఏంటి ఇదంతా ఏదైనా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశమా అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది నిజంగానే ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నవంబర్ 19 చోటుచేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూడండి.
Also read : వైరల్ వీడియో: గాయనిపై బకెట్లతో నోట్ల వర్షం కురిపించారు
ఏబీసీ10 న్యూస్ కథనం ప్రకారం శాండిగో నుంచి ఫెడెరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుకు భారీ మొత్తంలో నగదు తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ డెమి బాగ్బి అనే యువతి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన కళ్ల ముందు జరుగుతున్న అటువంటి దృశ్యాన్ని తానెప్పుడూ చూడలేదని, ఇకపై చూడబోను కూడా అని చెబుతూ అక్కడ జరుగుతున్న విషయాన్నంతా కొన్ని సెకన్లలోనే వివరించే ప్రయత్నం చేసింది.
ఇదంతా ఇలా ఉంటే.. ఇక్కడ కరెన్సీ నోట్లను దొంగిలించిన వారు తిరిగి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా స్థానిక పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోల ఆధారంగానే నిందితులను పట్టుకుంటున్నామని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఇంకొంత మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Also read : వైరల్ పిక్: పడగవిప్పిన మూడు పాములు.. ఆశీర్వాదం అనుకో అంటున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్
పోలీసులు చేసిన ప్రకటనతో కొంతమంది స్వయంగా పోలీసు స్టేషన్‌కి వచ్చి తాము రోడ్డుపై ఏరుకున్న కరెన్సీ నోట్లను స్వచ్చందంగా ఇచ్చి వెళ్తున్నారని సోషల్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడ్డానికి సినిమాటిక్‌గా ఉన్న ఈ వీడియో నిజంగా జరిగిందంటే.. ఇప్పటికీ.., ఎంతకీ నమ్మశక్యంగా లేదు కదా!!
Also read : ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook