Viral Video: ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ ఉన్నారుగా

Viral Video of Bride kissing Groom: పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. మండపంలో వేదమంత్రాలు చదువుతున్న పండితుడు కూడా అలా చూస్తుండిపోయాడంతే. మేడం సార్.. మేడం అంతే అన్నట్టుగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 07:51 AM IST
  • పెళ్లి మండపంలో సిగ్గుపడి కంట్రోల్ చేసుకున్న వరుడు
  • సిగ్గుపడకుండా వరుడికి సహకరించిన నవ వధువు
  • అమ్మాయి డేరింగ్ చూసి షాకైన పండితుడు, బంధుమిత్రులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వధువు డేరింగ్ స్టంట్
Viral Video: ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ ఉన్నారుగా

Viral Video of Bride kissing Groom: ఇండియాలో పెళ్లిళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక జీవిత కాలానికి సరిపోయే వేడుక లాంటిది. పెళ్లి అంటే చాలు.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా వాళ్లు తగ్గేదేలే అనేట్టు చేసుకునే గొప్ప సంబరం. అలాంటి పెళ్లిలో ఎన్నో సన్నివేశాలు, ఎన్నో పద్ధతులు సందడి చేస్తుంటాయి. వధూవరుల కాస్టూమ్స్ నుంచి వారు పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఎన్నో వీడియోలు
వైరల్ అవుతుండటం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. 

మరీ ముఖ్యంగా పెళ్లిలో కెమెరాకు చిక్కే కొన్ని రొమాంటిక్ మూమెంట్స్, ఫన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో తెలిసిందే. అలాంటి దృశ్యమే ఇదిగో ఈ పెళ్లి వీడియోలోనూ కెమెరాకు చిక్కింది. వరుడు తాళి కట్టే సమయంలో వధువుకి దగ్గరిగా వచ్చాడు. ఆమె ముఖానికి దగ్గరిగా వంగి తాళి కడుతున్నాడు. కాబోయే భార్యకు మండపంలోనే ముద్దు పెట్టాలని ఉన్నా.. అందరూ ఉన్నారనే మొహమాటంతో ఆగిపోయినట్టుగా ఉంది అతడి యాంగిల్. అతడి పరిస్థితి చూసి జాలిపడిందో లేక ఆమెకు కూడా ముద్దు పెట్టే మూడ్ వచ్చిందో తెలియదు కానీ అతడు చేయని పనిని ఆమె పూర్తి చేసింది. తనకు తాళి కడుతున్న భర్త చెంపపై అందరూ చూస్తుండగానే ఓ ఘాటైన ముద్దు ఇచ్చేసింది.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

 

 

పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. మండపంలో వేదమంత్రాలు చదువుతున్న పండితుడు కూడా అలా చూస్తుండిపోయాడంతే. మేడం సార్.. మేడం అంతే అన్నట్టుగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ( Viral Video ) మారింది. వధువు స్పీడ్ చూసిన నెటిజెన్స్.. పెళ్లయ్యే వరకు ఆగలేకపోయావా ? మండపంలోనే ఏంటా నాటు సరసం అంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. రొమాన్స్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ ఉన్నారుగా అంటూ ఇంకొంతమంది తమ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతున్నారు.

Also Read : Woman Collapses mid-air: విమానం గాల్లో ఉండగా గుండెనొప్పితో కుప్పకూలిన మహిళ.. తరువాత ఏమైందంటే..

Also Read : Gigantic Goldfish: గాలానికి 20 ఏళ్ల గోల్డ్ ఫిష్.. బరువు 30 కిలోల పైమాటే..

Also Read :  Man vs Apes Viral Video: మందుబాబుకు చుక్కలు చూపించిన కొండముచ్చులు.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News