Video: రెప్ప పాటులో మృత్యువు నుంచి బయటపడ్డాడు.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం

Latest Viral Videos: చావును అతిదగ్గరగా చూడటమంటే ఇదే కాబోలు.. ఓ బైకర్ ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 21, 2022, 09:09 AM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • బస్సు చక్రాల కిందపడిపోయిన బైకర్
  • తృటిలో ప్రాణాలతో బయటపడిపోయాడు
Video: రెప్ప పాటులో మృత్యువు నుంచి బయటపడ్డాడు.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం

Latest Viral Videos: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వించేవి ఉంటాయి.. కొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయి.. కొన్ని భావోద్వేగానికి గురిచేసేవి ఉంటాయి.. ఇలా రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మనల్ని షాక్‌కి గురిచేసే వీడియోలు కూడా కనిపిస్తాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ బైకర్ మృత్యువుకు దగ్గరగా వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా అతను చాలా అదృష్టవంతుడని, భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే బతికిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వీడియోను గమనిస్తే... ఓ మూల మలుపు వద్ద బస్సు టర్న్ తీసుకుంటోంది. అదే సమయంలో అటు నుంచి ఓ బైకర్ దూసుకొచ్చాడు. ఒక్కసారిగా అదుపు తప్పిన అతను బస్సు చక్రాల కింద పడిపోయాడు. అతని తలభాగం సరిగ్గా బస్సు చక్రం కిందకు వెళ్లింది. తలకు హెల్మెట్ ధరించి ఉండటం.. బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తలకు హెల్మెట్ లేకపోయినా.. డ్రైవర్ బ్రేక్ వేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత కొద్ది క్షణాలు అతను షాక్‌లో ఉండిపోయాడు.కాసేపటికి బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని అక్కడి నుంచి లేపి పక్కకు తీసుకెళ్లారు. అతని బైక్‌ను పక్కకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 3 లక్షల పైచిలుకు మంది ఈ వీడియోని వీక్షించారు. 'ఓ మై గాడ్.. అతను నిజంగా అదృష్టవంతుడు' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 

Also Read : Telangana Rains Update: తెలంగాణలో మళ్లీ వర్షాలు... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం..

Also Read: Horoscope Today July 21st: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారిని తెలియని భయం వెంటాడుతుంది  

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News