Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!

Bride Dances DJ Song Before Wedding: ఇటీవలి కాలంలో పెళ్లికి ముందు, పెళ్లిలో వధువు తనకు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 07:40 PM IST
  • వైరల్ వీడియో
  • పెళ్లి బట్టల్లోనే మాస్ స్టెప్పులేసిన నవ వధువు
  • ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన వధువు
Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!

Bride Dances DJ Song Before Wedding: మన భారత దేశంలో 'పెళ్లి' అంటే రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఒకప్పుడు పెళ్లి మండపానికి వచ్చేవరకు కూడా వధువును పెళ్లి కుమారుడు చూసేవాడు కాదు. కాలక్రమేనా వధువు ఒక మూలన కూర్చునే రోజులు పోయాయి. ప్రస్తుతం వధువులు ఆ పాత మూస పద్ధతులను విచ్ఛిన్నం చేస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుళ్లు వారి పెళ్లి బట్టలు, జ్యువెలరీ నుంచి అన్ని స్వయంగా షాపింగ్ చేస్తున్నారు. అంతేకాదు వారి పెళ్లి ఎలా జరగాలో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. 

ఇటీవలి కాలంలో పెళ్లికి ముందు, పెళ్లిలో వధువు తనకు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లికి ముందు ఓ వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి డ్యాన్స్ చేసింది. తన మేకప్ రూంలోనే ఓ డీజే పాటకు పెళ్లి బట్టల్లోనే మాస్ స్టెప్పులు వేసింది. ఇలాంటి అవకాశం పోతే మళ్లీ రాదన్నట్టు డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తుంటే పక్కన వారు నవ్వులు పూయించారు. 

పెళ్లి బట్టల్లోనే మాస్ స్టెప్పులు వేసిన వధువు సంబందించిన వీడియో బ్రైడ్ స్పెషల్ (brides_special) అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయబడింది. 'పెళ్లి కొడుకులు మాత్రమే ఈ సంతోషాన్ని ఎందుకు ఆనందించాలి. వధువు కూడా ఎంజాయ్ చేస్తోంది. తనంతట తానుగా బాగా ఆస్వాదిస్తోంది. ఆమె తన జీవితం అంతా ఇలానే ఉండాలి కోరుకుంటున్నా' అని కాప్షన్ రాసుకొచ్చారు. 
 
ఒక్కరోజే క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వధువు చేసిన క్రేజీ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే వేళల్లో లైకులు వచ్చాయి. సూపర్ డాన్స్, ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేసినట్టు సమాచారం తెలుస్తోంది. 

Also Read: Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Also Read: టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News