Trending News: ఈ ఊళ్లో ప్రతి ఇంటి ముందు సమాధి..ప్రతి వారం పూజలు, ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

Viral News: ఇంటి ముందు పూల మొక్కనో, తులసి మొక్కనో పెట్టుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ గ్రామ ప్రజలు సమాధులు నిర్మించుకుంటారు. అయితే ఈ వింత ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామంలో ఇంకా చాలా వింతలున్నాయి. అవేంటో తెలుసా?

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 22, 2023, 05:27 PM IST
Trending News: ఈ ఊళ్లో ప్రతి ఇంటి ముందు సమాధి..ప్రతి వారం పూజలు, ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

 

Viral News: అందరు ఇంటి ముందు తులసి మొక్కనో..ఏదైనా ఫలాలు ఇచ్చే మొక్కలను నాటుకుంటారు. అయితే జార్ఖండ్‌లోని రాంచీ గ్రామంలో దీనికి భిన్నంగా ఉంది..ఏ ఇంటి దగ్గరికి వెళ్లినా..ఆ ఇంటి ముందు సమాధి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రామస్తులంతా భూతాలకు, దయ్యాలకు పూజిస్తారు. ఇలా చేయడం పూర్వీకుల నుంచి వస్తుందని అక్కడి ప్రజలు తెలిపారు. అంతేకాకుండా ఇలా దెయ్యాలకు పూజలు చేయడం సంప్రదాయంగా కూడా భావిస్తారట. అందుకే ఈ గ్రామానికి దెయ్యం గ్రామం అని కూడా పేరు వచ్చింది.

చాలా మంది దెయ్యాలంటే బయపడేవారు ఈ వింత ఆచార, వ్యహారాలను చూసి తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మనం కూడా నిత్యం వార్తాల్లో వింత ఆచారాలు, కట్టుబాట్ల గురించి తెలుసుకుని ఉంటాం. కానీ రాంచీలో అన్నింటికి భిన్నంగా ఉంది. ఈ దెయ్యం గ్రామంలో ప్రతి ఇంటి ముందు సమాధులు నిర్మిస్తారు. కొత్త ఇళ్లైనా, పాత ఇళ్లైనా తప్పకుండా ఇంటి ముందు సమాధి నిర్మించాల్సింది. అయితే ఈ ఆచారాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 

అంతేకాకుండా ఈ సమాధులను ప్రతి వారం పూజిస్తారు. ముఖ్యంగా భూతాన్ని పూజించకుండా ఎలాంటి శుభకార్యమైన అసంపూర్ణంగానే ఉంటుందని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. ఈ గ్రామంలో మూడు వందలకు పైగా ఇళ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రతి ఇంటి ముందు తప్పకుండా సమాధి ఉంటుందని గ్రామానికి చెందిన వారంటున్నారు. అయితే నిజానికి మనం చనిపోయిన వారిని దెయ్యాలుగా భావిస్తాం. కానీ అక్కడి ప్రజలు చనిపోయిన వారందరినీ దేవుళ్లుగా భావిస్తారట. అందుకే ప్రతి ఇంటి ముందు సమాధిని నిర్మించి పూజలు చేస్తాయని అక్కడి ప్రజలు అంటున్నారు. 

ప్రతి సంవత్సరంలో జరిగే ప్రతి శుభకార్యానికి ముందు చనిపోయిన వారిని పూజించి, వారి సమాధుల ముందు కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా పెళ్లిళ్లు, పుట్టిన రోజులు జరుపుకునేవారు కూడా సమాధుల ముందు చనిపోయిన వారికి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభించి అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని వారి నమ్మకం.

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News