Paani puri: పానీపూరిలో Urine కలిపిన చాట్ బండార్ నిర్వాహకుడు అరెస్ట్

Mixing urine in paani puri water: పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2021, 04:31 PM IST
Paani puri: పానీపూరిలో Urine కలిపిన చాట్ బండార్ నిర్వాహకుడు అరెస్ట్

Mixing urine in paani puri water: పానిపూరి తినే నీళ్లలో మూత్రం కలిపిన చాట్ బండార్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తాజాగా గువహటిలో చోటుచేసుకుంది. మమున్ ఖాన్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అస్సాం రాజధాని గువహటిలోని అత్గావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది. ఈ వైరల్ వీడియో (Viral videos) చూసిన నెటిజెన్స్‌లో కొంత మంది సదరు స్ట్రీట్ ఫుడ్ (Street food) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా.. ఇంకొంత మంది ఇక జీవితంలో పానీ పూరి తినకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. 

Also read : దారుణం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళా టిక్‌టాకర్‌పై 300 వందల మంది దాడి!

పానీ పూరిలో యూరిన్ (Mixing urine in paani puri water) కలిపిన ఈ ఘటనపై మరొక నెటిజెన్ స్పందిస్తూ.. అతడు పానీ పూరి అమ్మడం లేదు. యూరిన్ అమ్ముతున్నాడంటూ కామెంట్స్‌లో పేర్కొన్నాడు.

గతంలోనూ పలు సందర్భాల్లో పానీ పూరి నీళ్లలో (Pani puri water) పబ్లిక్ టాయిలెట్స్‌లోని నల్లా నీళ్లు కలిపిన ఘటనలు అనేకం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం మరోసారి పాత ఘటలన్నీ నెటిజెన్స్ కళ్ల ముందు కదలాడుతున్నాయి.

Also read : Facebook on Talibans: తాలిబన్‌పై నిషేధం విధించిన ఫేస్‌బుక్, ఇదే కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News