Huge Rare Double Headed Snake Video Watch Here: భూమిపై అనేక రకాల వింత విష సర్పాలు కనిపిస్తాయి. అందులో చాలా మందికి కొన్ని పాముల గురించే మాత్రమే తెలిసి ఉంటుంది. మరికొన్ని జాతులకు సంబంధించిన సర్పాల గురించి తెలిసి ఉండదు. సాధరణంగా మన భారత్‌లో కనిపించే చాలా పాములు విషపూరితమైనవే.. అందులో చాలా జాతులకు సంబంధించిన పేర్లు మనకు తెలుసు.. నల్లతాచు, కట్లపాము ఇలా చాలా వరకు భారత జాతులకు సంబంధించినవి ప్రమాదకరమైన పాముల కోవాలోకి వస్తాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో కొన్ని ఎలాంటి హాని తలపెట్టవట.
మనం తరచుగా వింత రంగు పాములు, తల సన్నం, తోక దొడ్డు వంటి పాములు కూడా చూస్తూ ఉంటాం.. కానీ భూమిపై వీటికంటే అరుదైన పాములు కూడా ఉన్నాయి. ఇటీవలే సోషల్ మీడియాలో రెండు తలలకు సంబంధించిన ఓ పాము విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పామును నల్లని చర్మంతో దగదగ మెరుస్తూ సోషల్ మీడియాలోని నెటిజన్స్‌ను ఆకర్శిస్తోంది. అయితే ఇలాంటి పనులు చాలా అరుదుగా కనిపిస్తాయని కొంతమంది పాముల శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇవి చాలా డేంజర్ అని కూడా వారు అంటున్నారు.
రెండు తలల పాములు ఆహార విషయంలో చాలా కోపంతో ప్రవర్తిస్తాయి. చిన్న కీటకలతో పాటు పెద్ద పెద్ద ఎలకలను కూడా ఎంతో సులభంగా మింగేసే సామర్థ్యం కలిగి ఉంటాయట. అయితే ఈ అంతరిస్తున్న పాముల జాతులను మిస్సోరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (MDC) కాపాడుతూ వస్తోంది. ఈ పాముకు ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంటుంది. దీనిని నిపుణులు టైగర్ లిల్లీ టూ హెడ్డ్ ర్యాట్ స్నేక్‌గా పిలుస్తారు. ప్రస్తుతం వీడియోలో వైరల్ అవుతున్న ఈ పాము అమెరికాలోని ఓ నేచర్ సెంటర్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇలాంటి జాతులకు సంబంధించిన పాములు భారత్‌లో కూడా ఉంటాయట.
ఇక ఈ పాము చెప్పుకున్నంత ప్రమాదకరమైనది కాదని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రెండు తలలు పాముకు ఉన్నపటికీ చాలా వరకు ఒకే జీర్ణక్రియ ఉంటుందట. అంతేకాకుండా వీటికి విడివిడిగా ఆహారాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొన్ని కొన్ని అరుదైన సమయాల్లో ఈ పాము ఒక తల ఆహారాన్ని సేకరిస్తే మరో తల మాత్రం అటూ ఇటూ చూస్తుందట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.