Valentines day: వాలెంటైన్స్ డే.. ఈ ఏడాది కూడా ఆన్లైన్ లో వాటికి ఫుల్ డిమాండ్..?.. సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదుగా..

Lovers Day: ప్రేమికులు తమ ప్రియమైన వారికి వాలెంటైన్ డే రోజు ఏదో ఒకరకంగా సర్ ప్రైజ్ చేయాలనుకుంటారు. దీనికోసం ఒక్కొరు , ఒక్కొలా ఆలోచిస్తుంటారు. వారం రోజుల నుంచి వాలెంటైన్ వీక్ సంబరాలను జరుపుకున్న ప్రేమికులు ఫిబ్రవరి 14 న వాలెంటైన్ డేను జరుపుకుంటారు. 

Last Updated : Feb 13, 2024, 06:38 PM IST
  • - ప్రేమికులు ఈరోజున ఫుల్ జోష్ తో గడుపుతారు...
    - తమ ప్రేమను వెరైటీగా అవతలి వారికి కన్వే చేస్తారు..
Valentines day: వాలెంటైన్స్ డే.. ఈ ఏడాది కూడా  ఆన్లైన్ లో వాటికి ఫుల్ డిమాండ్..?.. సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదుగా..

Condoms Sales Goup On Valentines Day:  ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. అది ఎప్పుడు ఎవరిమీద కల్గుతుందో ఎవరు చెప్పలేరు. ప్రేమకు క్యాష్ తో, క్యాస్ట్ తో కానీ అస్సలు  సంబంధం ఉండదు. ప్రేమకు వయసుతో కూడా అస్సలు అడ్డుకాదు. ముఖ్యంగా ప్రేమ అనేది ఒకరిని చూడగానే మనమనస్సులో ఏదొ ఒక తెలియని ఆనందం కల్గుతుంది. వారితో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. డైరెక్ట్ లేదా ఇన్ డైరెక్ట్ గా ఆ వ్యక్తిని చూసేందుకు నానా తంటాలు పడుతుంటారు. మనకు ఇష్టమైన వారికి ఏంనచ్చుతుందో, సర్ ప్రైజ్ గా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!

ఇప్పుడైతే, స్కూల్ డేస్ లలో కూడా పిల్లలు ఒకర్నిమరోకరు ప్రేమించుకుంటున్నామంటూ ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కాలేజీ డేస్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు లవర్స్ ను మెయింటెన్ చేయడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. కానీ నిజమైన మనస్సులో నుంచి పుట్టే ప్రేమ అనేది ఒకరి మీదే కల్గుతుంది. అలాంటి వారి ప్రేమను అవతలి వారికి తెలియజేస్తే, కొందరు లైఫ్ మరో లెవల్ లో ఉంటుంది. రిజక్ట్ చేసిన కూడా అలాంటి వారు తమ మనస్సులో ఉన్నవారి ఆనందం కోసం మాత్రమే తాపత్రయపడుతుంటారు.

అంతే కానీ.. తనకు దక్కింది.. ఎవరికి దక్కదన్నట్లుగా ప్రవర్తించారు. నిజంగా ప్రేమించిన వారు తమకు ఇష్టమైన వారికి ఏందొరితే ఆనందంగా ఉంటారో అది ఇవ్వడానికి ఎంత రిస్క్ అయిన చేయడానికి వెనుకాడరు. కానీ కొందరు యువతీ,యువకులు మాత్రం.. ప్రేమపేరుతో అడ్డమైన తిరుగుళ్లు తిరిగి.. కేవలం అవసరాల కోసం ప్రేమను ఒక సాకుగా చేసుకుంటారు. చివరకు అవరసరం తీరిపోయాక.. బ్రేకప్ లు చెప్పుకుంటూ, కొత్త వారితో జర్నీ స్టార్ట్ చేస్తారు.

ఇలాంటి వారు ప్రేమ ముసుగులో ఉండి అడ్డమైన పనులు చేస్తారు. పవిత్రమైన ప్రేమలో ఉన్నట్లు నటిస్తు అవతలి వారిని శారీరకంగా లోబర్చుకుంటారు. ఇలాంటి వారు.. వాలెంటైన్ వీక్ అంటూ అమ్మాయిలను లేదా అబ్బాయిలను ట్రాప్ లో దించుతుంటారు. పవిత్రమైన ప్రేమికుల రోజును కూడా కామంతో తమ కోరికలను తీర్చుకునేందుకు అనువుగా మలుచుకునే వాళ్లు కూడా ప్రస్తుతం సమాజంలో లేకపోలేదు.

Read More: Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి

పాశ్చాత్య పోకడలకు పోయి, పవిత్రమైన  ప్రేమ ముసుగులో నీచపు పనులకు పాల్పడుతున్నారు. అయితే.. గతేడాది వాలెంటైన్ డే రోజున కండోమ్ ల ఆన్ లైన్ విక్రయాలు భారీగా జరిగాయని వార్తలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఫిబ్రవరీ 14 వాలెంటైన్ డే నేపథ్యంలో.. మరోసారి కండోమ్ ల అమ్మకాలపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News