Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం

YouTubers Prank Video Shot In Tirumala Que Lines: ప్రభుత్వాలు మారినా తిరుమలలో భద్రతా వైఫల్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా తిరుమలలో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రాంక్‌ వీడియోలు వైరల్‌గా మారాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 11, 2024, 11:02 PM IST
Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం

 Tirumala Prank Video: పరమ పవిత్రమైన తిరుమల కొండలో ఆకతాయిలు వికృత చేష్టలకు దిగారు. భక్తులతో ప్రాంక్‌ పేరిట ఆటాడుకున్నారు. క్యూలైన్‌లలో కెమెరాలు, ఫోన్లను తీసుకెళ్లి పైశాచిక ఆనందం పొందారు. క్యూ లైన్‌ కాంప్లెక్స్‌లలో దర్శనానికి గేట్లు తీస్తున్నట్లు నటించి భక్తులను వెర్రివాళ్లను చేశారు. ఈ సంఘటన తిరుమలలో తీవ్ర దుమారం రేపింది. భక్తుల మనోభావాలను ఆటాడుకోవడమే కాకుండా క్యూ లైన్‌లలోకి సెల్‌ఫోన్లు ఎలా వెళ్లాయనేది కలకలం రేపిన విషయం. అయితే ప్రాంక్‌ చేసిన వారిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

Also Read: Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు

తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు టికెట్లు లేనివారు శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్‌లలో వెళ్తుంటారు. సర్వ దర్శనానికి కొన్ని గంటల సమయం పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు తమిళ  యూట్యూబర్లు క్యూలైన్‌లలో హేయమైన చర్యలకు పాల్పడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రాంక్ వీడియో చేశారు. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని రూపొందించారు. కంపార్ట్మెంట్‌లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి  ఒక్కసారిగా పైకి లేచారు. వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టాడు. ఇదంతా వీడియోగా రికార్డు తీశారు. అనంతరం తమ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Also Read: Stag Beetle: బీఎండబ్ల్యూ, బెంజ్‌ కారు కన్నా ఈ పురుగు చాలా కాస్టిలీ.. ఏమంత స్పెషలో తెలుసా?

ఈ వీడియో చూసిన భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో  సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాడులో వైరల్‌గా మారింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తుల నుంచి మొబైల్స్ తీసుకుంటారు. భక్తుల గోవింద నామాలతో మారుమోగే  తిరుమల కంపార్ట్మెంట్‌లో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ  వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు  దెబ్బ తిన్నాయి. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

భద్రతా వైఫల్యం
కట్టుదిట్టమైన భద్రతా ఉండాల్సిన తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తిరుమల క్షేత్రంలోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేని విషయం తెలిసిందే. క్యూలైన్‌ కాంప్లెక్స్‌లలోకి వెళ్లకముందే ఫోన్లతోపాటు అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు సమర్పించాల్సి ఉంది. కానీ తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే యూట్యూబర్, అతడి స్నేహితులు సెల్‌ఫోన్లు ఎలా తీసుకెళ్లారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియోనే కాదు రెండు, మూడు వీడియోలు వారు తీశారు. తిరుమల క్షేత్రంలో మళ్లీ భద్రతా వైఫల్యాలు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా కూడా తిరుమల క్షేత్రంలో పరిస్థితులు మారలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News