Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు... తరువాతేం జరిగింది..??

రైలుకు ఎదురుగా ఒక ఏనుగు దూసుకోస్తుంది... ఇది చూసిన ట్రైన్‌ డ్రైవర్లు వెంటనే రైలును ఆపి మూగజీవం ప్రాణాలు కాపాడారు. రైల్వే మేనేజర్‌ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2021, 08:14 AM IST
  • ఏనుగును కాపాడిన ట్రైన్‌ డ్రైవర్లు
  • వీడియో పోస్ట్ చేసిన డివిజన్‌ రైల్వే మేనేజర్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు... తరువాతేం జరిగింది..??

ఏనుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగుపై సవారి చేయాలని అందరికి ఉన్న అడవి ఏనుగుల చూస్తే భయపడల్సిందే! ఇపుడ ఒక ఏనుగు వీడియో నెట్ లో తెగ వైరల్ (Viral Video) అవుతుంది.. అదేంటో చూద్దాం పదండి మరీ!  

ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని (Paschim Bengal) నగర్‌కటా-చల్సా (Nagrkata - Chalsa) మధ్య జరిగింది, దారి తప్పిన ఒక ఏనుగు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అదే సమయంలో ట్రాక్‌పై కంచన్‌ కన్య ఎక్స్‌ప్రెస్‌ (Kanchan Kanya Express) సూపర్‌ఫస్ట్‌గా దూసుకువస్తోంది. ఇది చూసిన ట్రైన్ డ్రవర్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. 

Also Read: కేసీఆర్‌కు షాక్ ... దళిత బందు తరహాలో సాయం కావాలంటూ గల్ఫ్ కార్మికులు

ఏనుగును చూసిన వెంటనే బ్రేక్ వేసి, హారన్ మొగించటంతో ఏనుగు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళింది. ఏనుగు వెళ్లిన తరువాతే రైలుని స్టార్ట్‌ చేసారు, ఇద్దరు డ్రైవర్లు ఏంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారు. ఇద్లోదరిలో ఒక ట్రైన్ డ్రైవర్ ఈ వైనాన్ని వీడియో తీసాడు. 

ఈ వీడియోని అలీపూర్‌ దౌర్‌ (Alipurduar) డివిజన్‌ రైల్వే మేనేజర్‌ (Railway Manager ) తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఆగస్ట్‌ 25న పోస్ట్‌ చేశారు. అప్పటినుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఏనుగుని కాపాడిన ఇద్దరు డ్రైవర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 5300 వ్యూస్‌, 361 లైక్స్‌ వచ్చాయి. 

Also Read: Bollywood celebrities bodyguards salaries: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బాడీగార్డులకు కోట్లలో పారితోషికం

కంచన్‌కన్యా ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్ దౌర్‌ నుంచి కోల్‌కతా సీల్డా వరకు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో సిలీగుర్‌ నుంచి అలీపూర్‌ వరకు 3 నుంచి 4 గంటలు అడవిగుండా ప్రయాణం చెయ్యాలి. కేవలం ఈ ప్రాంతంలో కన్పించే వన్యప్రాణుల కోసమే చాలామంది రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ రైలు మార్గంలో చాలాసార్లు అడవి జంతువులు రైలు పట్టాలకు అడ్డంగా వచ్చి మృత్యువాత పడ్డాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినా… జంతువులు రైలు పట్టాలపైకి రాకుండా మాత్రం చేయలేకపోతున్నారు....

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News