Two Rajasthan womens fall into drain while fighting: ఇటీవలి కాలంలో ఆస్తి తగాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవ పెద్దదిగా మారి ఏకంగా హత్యలు చేసుకునే వరకు వెళుతుంది. అలానే అక్కాచెల్లెళ్ల మధ్య కూడా ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు ఆస్తి విషయంలో గొడవపడి రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఎలాంటి ఘటనే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని బీవార్ నగరంలోని తత్గఢ్ రోడ్డులో ఉన్న నైరా పెట్రోల్ పంప్ సమీపంలో ఆస్తి వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇరువర్గాల మహిళలు దారుణంగా తిట్టుకుంటూ కొట్టుకునే పరిస్థితికి చేరారు. ఇద్దరు మహిళలు గొడవ పడుతూ.. డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీలో పడినా ఆ మహిళలు మాత్రం కొట్టుకోవడం ఆపలేదు. ఒకతను కాలువలో దిగి ఒక స్త్రీని కొడుతుండగా.. మరో వ్యక్తి కూడా ఆమెను పట్టుకోవడానికి కాలువలో దిగుతాడు. అంతలో మరో వ్యక్తి వచ్చిడ్రైనేజీపై నుంచి అతనిపై తంతాడు. ఇలా ఇరు వర్గాలు గొడవపడ్డాయి.
ఇరు వర్గాలు కొట్లాడుకుంటుంటే.. ఆ పోరాటాన్ని చూసేందుకు భారీ ఎత్తున జనం కూడా గుమిగూడారు. వారిని విడిపించడానికి ఎవరూ ప్రయతించలేదు. ఈ ఘటన మొత్తం రోడ్డుపై ఉన్న సీసీటీవీలో రికార్డయింది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
अजमेर के करोड़पति घर की देवरानी-जेठानी में हुआ विवाद, लड़ते लड़ते नाले में गिरी pic.twitter.com/XQbT1XKrs0
— The Fact Factory. (@FactTheFactory) June 17, 2022
ఈ ఆస్తి తగాదాకు సంబంధించిన వీడియోను సిటీ ఎస్‌హెచ్‌వో సురేంద్ర సింగ్ జోధా పరిశీలించారు. అనంతరం సురేంద్ర సింగ్ మాట్లాడుతూ... ఆస్తి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇద్దరు మహిళల మధ్య గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook