Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

Teen Girl reel In Airport: ఎయిల్ పోర్టులో ఒక యువతి రచ్చ చేసింది. రద్దీగా ఉన్న ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీ దగ్గరకు వెళ్లింది. అది గుండ్రంగా తిరుగుతుండగా చూసి, వెంటనే దానిపై పడుకొని రీల్స్ చేసింది. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 30, 2024, 07:11 PM IST
  • ఎయిర్ పోర్టులో యువతి రీల్స్..
  • సోషల్ మీడియాలో రచ్చగా మారిన ఘటన..
Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని  రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

Teen Girl Cute Reel In Airport Trally: కొందరు తమ టాలెంట్ ను పెట్టడానికి సోషల్ మీడియాను ఒక రేంజ్ లో వాడుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు చెందిన అనేక రీల్స్ ఘటనలు తరచుగా వివాదస్సదమవుతున్నాయి. రద్దీగా ఉన్న బస్సులో రీల్స్ చేస్తున్నారు. హోలీ ఆడుకుంటూ, మెట్రోలో రొమాన్స్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్నారు. ఇంకొందరు, రోడ్ల మీద చూడటానికి అసహ్యాకరమైన డ్రెస్సులలో కూడా వీడియోలు తీసుకుంటున్నారు. ఇక బైక్ మద కిస్సులు, రీల్స్ లకు మాత్రం సోషల్ మీడియాలో ఏ మాత్రం కొదువలేదని చెప్పుకొవచ్చు. కొందరు దీన్ని రీల్స్ మెనియా పిచ్చి అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల ఇప్పటికే వివాదస్పదంగా రీల్స్ చేసిన వారికి పోలీసులు దిమ్మతిరిగే ట్రీట్మెంట్ ఇచ్చారు. అచ్చం ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

ఒక యువతి రద్దీగా ఉన్న ఎయిర్ పోర్టులో చేసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. యువతి కజల్, షారుఖ్ ఖాన్ నటించి కుచ్ కుచ్ హోటా హై మూవీలోని.. క్యారంగ్ లాయి మేరే దువా.. అనే పాటకు పడుకుని మరీ  రీల్స్ చేసింది. ఎయిర్ పోర్టులో అడుగడుగున కేంద్ర భద్రత దళాలు పహారకాస్తుంటాయి. అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు.

అంత మందిలో కూడా యువతి ఏమాత్రం మోహమాట పడకుండా వెళ్లి రీల్స్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం రీల్స్ పిచ్చిరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More: Drinking Human Blood: మనిషి రక్తాన్ని జ్యూస్ లా తాగేస్తున్న యువతి.. వీక్లీ 36 లీటర్లేనంట.. ఎక్కడో తెలుసా..?

మరికొందరు మాత్రం.. దీనిపై అధికారులు చర్యలు తీసుకొవాలని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా రీల్స్ చేయడంపై పోలీసులు కూడా ఈ మధ్య పలువురు అమ్మాయిలకు జరిమాన విధించిన విషయం తెలిసిందే.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News