Crocodile Video Viral: మొసళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. భారీ వర్షాలు చెరువుల్ని, ఊర్లనీ ఏకం చేస్తుంటే రాకుండా ఎలా ఉంటాయి. మధ్యప్రదేశ్ శివపురిలో అదే జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చెరువులు, వాగుల్లో ఎక్కువగా కన్పించే భయంకరమైన మొసళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా నిజమే ఇది. భారీ వర్షాలు చెరువులు, ఊర్లను ఏకం చేస్తుంటే అవి మాత్రం ఏం చేస్తాయి. నీళ్లతో పాటు జనావాసాల్లోకి రాక తప్పదు. అదే జరిగింది మధ్యప్రదేశ్ శివపురిలో. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో వరదనీరు ఊరిని ముంచెత్తింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలతో పాటు శివపురిలో ఓ భయంకరమైన మొసలి కూడా జనావాసాల్లోకి వచ్చేసింది. దాదాపు గంటసేపు ప్రయత్నించిన తరువాత ఎట్టకేలకు ఆ మొసలిని అధికారులు పట్టుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో మొసలి వరద నీటిలో కన్పించింది.
దాదాపు 8 అడుగుల పొడుగున్న ఈ మొసలిని చాలాసేపు శ్రమించి పట్టుకున్న తరువాత సాంఖ్య సాగర్ సరస్సులో వదిలేశారు. ఈ సరస్సు సమీపం నుంచి ప్రవహిస్తున్న ఓ కాలువ ద్వారా మొసలి శివపురిలో జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH
— Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022
శివపురిలో కురిసిన భారీ వర్షాలకు నగరమంతా జలమయమైపోయింది. చాలా కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. ఇందులో సర్క్యూట్ హౌస్ రోడ్, రాంబాగ్ కాలనీ, గాయత్రి కాలనీ, శంకర్ కాలనీ, నాయి కి బగియా, మహావీర్ నగర్ ప్రైవేట్ బస్‌స్టాండ్ రోడ్, నవాబ్ సాహెబ్ రోడ్, పాత బస్టాండ్, విష్ణు మందిరం ప్రాంతం, హోటల్ ఐస్ ప్యాలేస్ ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.
శివపురి నగరంలో వరుసగా రెండవ ఏడాది వర్షాలకు కాలనీలు జలమయమవడతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. వర్షం నీరు వెళ్లే కాలువల్ని శుభ్రం చేయకపోవడమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో నిర్మించిన కాలువలు అస్తవ్యస్థంగా ఉండటం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also read: Rakesh Jhunjhunwala Dance Video: షేర్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝుంఝున్‌వాలా డ్యాన్స్ వీడియో చూశారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook