Rs 500 notes Showered: జనంపై లక్షల విలువైన రూ. 500 నోట్లు గుప్పించిన మాజీ సర్పంచ్.. వీడియో వైరల్

Rs 500 notes Showered in Wedding Baraat: ఆ ఊరి మాజీ సర్పంచ్ విసురుతున్న నోట్లను పోగేసుకోవడానికి కింద ఉన్న నిరుపేద జనం ఎగబడ్డారు. పై నుంచి వర్షంగా కురుస్తున్న నోట్లలో అధికంగా రూ. 500 నోట్లు ఉండగా.. ఇంకొన్ని రూ. 100 నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఘనంగా జరిపించాను అనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఊరి మాజీ సర్పంచ్ ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 01:25 PM IST
Rs 500 notes Showered: జనంపై లక్షల విలువైన రూ. 500 నోట్లు గుప్పించిన మాజీ సర్పంచ్.. వీడియో వైరల్

Rs 500 notes Showered in Wedding Baraat: అక్కడ ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పెళ్లి ఊరేగింపు చూడ్డానికి వచ్చిన జనంతో వీధి అంతా రద్దీగా ఉంది. అందరి చూపు నవ జంటపై ఉంది. ఇంతలోనే ఉన్నట్టుండి ఆకాశంలోంచి రూ. 500 నోట్ల వర్షం మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చిపడుతున్నాయి ఈ రూ. 500 నోట్లు అని పైకి చూసిన వారు తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. పెళ్లి జరుగుతున్న ఇంట్లోంచే పై అంతస్తులోంచి రూ. 500 నోట్లను విసురుతూ కనిపించాడు ఆ ఊరి మాజీ సర్పంచ్. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షల విలువ చేసే నోట్లను జనంపైకి విసిరి తన ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుక ఎంత ఖరీదైందో చెప్పాడు ఆ మాజీ సర్పంచ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని కెక్రి మండలంలోని సేవ్డా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఊరి మాజీ సర్పంచ్ విసురుతున్న నోట్లను పోగేసుకోవడానికి కింద ఉన్న నిరుపేద జనం ఎగబడ్డారు. పై నుంచి వర్షంగా కురుస్తున్న నోట్లలో అధికంగా రూ. 500 నోట్లు ఉండగా.. ఇంకొన్ని రూ. 100 నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఘనంగా జరిపించాను అనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఊరి మాజీ సర్పంచ్ ఈ పనిచేసినట్టు తెలుస్తోంది. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరీ అతడు ఈ సీన్ క్రియేట్ చేశాడట.

 

చూశారు కదా.. సినిమాల్లో మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. నిజ జీవితంలో ఇలాంటి పనులు ఎంతమందికి సాధ్యమవుతాయి. ఇదిలావుంటే జనంపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్ తీరుపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. అంతగా డబ్బులు ఉంటే.. వాటిని నిరుపేదల ఆకలి తీర్చడానికి ఉపయోగించవచ్చు కదా అని కొంతమంది నెటిజెన్స్ మండిపడితే.. అదే డబ్బును ఉపయోగించి పేద పిల్లలను చదివించడమో లేక పెళ్లి చేయడమో చేయొచ్చు కదా అని ఇంకొంతమంది హితవు పలుకుతున్నారు. సర్పంచ్ పదవి చేస్తేనే ఇంతలా వెనకేశాడంటే.. ఇంకా ఎమ్మెల్యేగానో లేక ఎంపీగానో చేసి ఉంటే ఇంకెంత బలిసిపోయే వాడో.. ఇంకేం చేసే వాడో అని ఆగ్రహం వ్యక్తంచేస్తోన్న వాళ్లు కూడా లేకపోలేదు.

ఇది కూడా చదవండి : Taraka Ratna With Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో తారక రత్నకు విబేధాలు ?

ఇది కూడా చదవండి : Taraka Ratna vs Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేసేందుకే తారకరత్న పోటీగా వచ్చారా ? తారకరత్న ఏమన్నారంటే..

ఇది కూడా చదవండి : Taraka Ratna's Death News: తారక రత్న గురించి బాలకృష్ణ మాటలు వింటే ఏడుపొస్తుంది

ఇది కూడా చదవండి : Nandamuri Taraka Ratna's Deadbody: మోకిలలోని స్వగృహానికి తారక రత్న పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News