Black Holes: అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం విశేషం.
పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్ హోల్స్(Black Holes)ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను 'ఆస్రోనమీ'’ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ‘‘'మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్‌జీసీ7733ఎన్.. అనేది ఎన్‌జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి'’’ అని పేర్కొన్నారు.
Also Read: Sea Disappeared: విచిత్రం: ఏపీలో రాత్రికి రాత్రే సముద్రం మాయం..ఏం జరిగిందో తెలుసా..!
గెలాక్సీ(Galaxy) జంట.. ఎన్‌జీసీ7733ఎన్-ఎన్‌జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల(Black Holes) కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(Indian Institute of Astrophysics)కు చెందిన జ్యోతి యాదవ్, మౌసుమి దాస్, సుధాన్షు బార్వే.. ఆస్ట్రోసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో వీటిని వీక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ఎస్‌ఎఫ్, చిలీ వీఎల్‌టీ, యూరోపియన్ యూనియన్(European Union)కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం విడుదల చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Black Holes: అంతరిక్షంలో ఖగోళ వింత...గుర్తించింది మనవాళ్లేనంట!