Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో చెప్పండి

Optical Illusion: మీరు ఫజిల్స్ అంటే ఇష్టమా? అయితే ఈ వార్త మీ వాళ్లకోసమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఉన్న ఓ చిన్న జంతువు ఫొటోను ఎవరూ కనుగొనలేకపోతున్నారు. మరి మీరు ట్రై చేసి విజయం సాధిస్తారా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 02:52 PM IST
  • రాళ్ల మధ్యలో దాగి ఉన్న చిన్ని కుందేలు
  • గుర్తు పట్టలేక తిప్పలు వడుతున్న నెటిజన్లు
  • నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో..
Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో చెప్పండి

Optical Illusion: మీ కళ్లకు ఈ రోజు పరీక్ష పెట్టబెతున్నాం. మీరు ఏ వస్తువునైనా ఎంత క్లియర్​గా చూడగలరో తెలుసుకునేందుకు ఉపయోగపడేలా ఈ చిత్రన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో ఏముంది? ఈ పరీక్షలో మీరు గెలుస్తారా? ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. మొత్తం రాళ్లతో కూడిన ఈ ఫొటోలో చాలా మంది గుర్తించలేని ఓ జంతువు దాగి ఉంది. రాళ్ల మధ్యలో దాగి ఉన్న ఆ జంతువుని గుర్తించడంలో దాదాపు 99 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మరి రాళ్ల మధ్య దాగున్న ఆ జంతువేది? అది ఎక్కడ ఉందో మీరు గుర్తించగలరో ప్రయత్నించండి. ఓకవేళ మీరు గెలిస్తే.. ఒక్క శాతం మందిలో మీరు ఒకరవుతారు.

ఒకవేళ మీరూ గుర్తించలేదా?

ఈ రాళ్ల మధ్యలో ఓ చిన్న కుదేలు దాగి ఉంది. అయితే దాని గుర్తించడం అత్యంత కష్టం. ఆ ఫొటోను తీక్షణంగా అంగుళం, అంగుళం చూస్తే తప్పా అది ఎక్కడుందో దొరగటం లేదు. చాలా మంది ఎంత ప్రయత్నించినా దానిని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారికోసం.. మేం సహాయం చేస్తాం.

ఆ ఫొటో మధ్యలో మీ దృష్టిని కేంద్రీకరించండి.. ఇప్పుడు రాళ్ల మధ్య ఉన్న రంద్రం కనిపిస్తుంది.. దానికి సమీపంలో ఓ చిన్న కుందేలు కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ అందమైన కుందేలు మిమ్మల్నే చూస్తున్నట్లుగా ఉంటుంది.

మరి ఈ ఫజిల్​ను మీరు మాత్రమే చూస్తే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్​, ఫ్యామిలితో షేర్ చేసి వాళ్లను కూడా పరీక్షించండి.

Also read: Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...

Also read: Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు... ఇదిగో ఇలా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News