Shiraz Vlogger: యూట్యూబ్‌ మెచ్చిన పాకిస్థాన్‌ బుడ్డోడి కిర్రాక్‌ వీడియోలు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు

Mohammad Shiraz Vlogs: నిండా ఆరు ఏళ్లు లేడు కానీ ఆరు లక్షల సబ్‌స్క్రైబర్లు పొందాడు. మాటలు సరిగ్గా రావు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల ఫాలోవర్లు పొందారు. అతడి వీడియోలు చూస్తే చూస్తూనే ఉంటాయి.. ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 13, 2024, 06:09 PM IST
Shiraz Vlogger: యూట్యూబ్‌ మెచ్చిన పాకిస్థాన్‌ బుడ్డోడి కిర్రాక్‌ వీడియోలు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు

Vlogger Shiraz: సోషల్‌ మీడియా ద్వారా ఇప్పుడు అందరూ విశేష గుర్తింపు పొందుతున్నారు. కానీ ఒక బుడ్డోడు.. ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి.. నడక కూడా ఇంకా రాదు కానీ వ్లాగర్‌గా మారాడు. అతడి వీడియోలు చూస్తే ఎంతో ముద్దుగా ఉంటాయి. నిండా ఆరేళ్లు నిండలేదు కానీ ఆ బాలుడికి ఆరు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు లక్షల సంఖ్యలో ఉంటున్నారు. బొద్దుగా.. ముద్దుగా ఉన్న ఈ బాల వ్లాగర్‌ చూసి నెటిజన్లు అభిమానులుగా మారిపోతున్నారు. ఇంతకీ ఆ యూట్యూబర్‌ ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోండి.

Also Read: Namaz: దురహంకారం.. నమాజ్‌ చేస్తుండగా ముస్లింలను తన్నిన పోలీస్‌ అధికారి

పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్‌ షిరాజ్‌ అనుకోకుండా వ్లాగర్‌గా మారాడు. గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లోని ఘంచె జిల్లాలోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్‌ వీడియోలు చేస్తున్నాడు. అతడి గ్రామం ఖప్లు ఎంతో సుందరమైన ప్రదేశం. హిమాలయాలకు చేరువ ఉండడంతో అతడి చుట్టూ పరిసరాలు చూడముచ్చటగా ఉన్నాయి. అయితే ఒకోసారి అనుకోకుండా వీడియో తీయడంతో ఊహించని స్పందన లభించింది. వెంటనే కుటుంబసభ్యులు 'షిరాజి విలేజ్‌ వ్లాగ్స్‌' అనే పేరు మీద యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తెరిచారు. షిరాజ్‌ తన సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా వీడియోలు చేయడు. తన జీవితంలో రోజువారీ జరిగే పనులు, కార్యక్రమాలను వివరిస్తూ వ్లాగ్స్‌ చేస్తున్నాడు. పెట్టిన నెల రోజులకే విశేష గుర్తింపు పొందడం బుడ్డోడు సాధించిన ఘనత.

Also Read: Exam Forgot: మీ మతిమరుపు తగిలెయ్య.. హాల్‌ టికెట్లు ఇచ్చి పరీక్ష మరిచిన యూనివర్సిటీ

అతడికి ముస్కన్‌ అనే చెల్లెలు కూడా ఉంది. తన చెల్లెలును మొదటిసారి పాఠశాలకు పంపడం, స్నేహితుడి ఇంటికి వెళ్లడం, తన దోస్త్‌కు గిఫ్ట్‌ ఇవ్వడం తదితర వీడియోలు చేశాడు. ఆ వీడియోలు చూస్తే ఎంతో ముద్దుగా ఉంటాయి. షిరాజ్‌ మాట్లాడే మాటలు వింటే మరింత ఆసక్తిగా ఉంటాయి. టోపీ పెట్టుకుని మాట్లాడుతూ నవ్వుతూ సరదాగా ఉంటాడు. బొద్దుగా.. ముద్దుగా ఉన్న షిరాజ్‌ ముద్దుముద్దు మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బుడ్డోడి వీడియోలను ఒక్క పాకిస్థాన్‌ ప్రజలే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు చూస్తున్నారు. షిరాజ్‌ మాట్లాడేది మొత్తం పాకిస్థానీ ఉర్దూ భాషే అయినా.. ఇది అర్థం కాకున్నా షిరాజ్‌ మాట్లాడే విధానం నచ్చుతుండడంతో ఉర్దూ రానివాళ్లు కూడా చూస్తున్నారు.

షిరాజ్‌ విలేజ్‌ వ్లాగ్స్‌ ఛానల్‌లో ఇప్పటివరకు 66 వీడియోలు పోస్టు చేయగా 6 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. త్వరలోనే ఏడు లక్షల మార్క్‌కు చేరనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల ఫాలోవర్లు పెరిగారు. ఇటీవల యూట్యూబ్‌ 'సిల్వర్‌ ప్లే బటన్‌' కూడా లభించింది. పాకిస్థాన్‌లో అత్యంత 'పిన్నవయసు' వ్లాగర్‌గా షిరాజ్‌ గుర్తింపు పొందాడు.
 

 
 
 
 
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News