Baby Elephant Viral Video: పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం

Baby Elephant Viral Video: జంతువుల వింత చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. ఇంకొన్నిసార్లు కడుపుబ్బా నవ్విస్తాయి. క్యూట్‌గా ఆకట్టుకుంటాయి. ఈ పిల్ల ఏనుగు వీడియో కూడా అలాంటిదే. పెద్ద ఏనుగు బీభత్సం సృష్టిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. ఈ పిల్ల ఏనుగు క్యూట్ యాక్ట్స్ కూడా అంతే క్యూట్ గా అనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 09:10 AM IST
Baby Elephant Viral Video: పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం

Baby Elephant Viral Video: పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవుతుంటే వాళ్లు చేసే వింత చేష్టలు ఎలా ఉంటాయో చూస్తుంటాం కదా.. క్యూట్ గా అల్లరి చేస్తూ, తమ చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా పరిశీలిస్తూ, చేతికి అందిన వస్తువులను తదేకంగా, వింతగా పరిశీలిస్తూ చూస్తుండటం చూస్తోంటే చాలా ముద్దోస్తుంది కదా.. చూడ్డానికి వారి అమాయకపు చూపులు ఎంత లవ్లీగా, ఎంత క్యూట్‌గా ఉంటాయో తెలిసిందే. అచ్చం అలాగే ఉంది ఇదిగో ఈ ఏనుగు పిల్ల వ్యవహారం.

తన తొండాన్ని చూసుకుని తనే అయోమయానికి గురవుతోంది ఈ పిల్ల ఏనుగు. అది తన తొండమే అని తెలియక.. ఎంత పరిశీలించినా ఏం అర్థం కానట్టుంది కాబోలు.. ఇది నాకంటే ముందు ఎందుకు వెళ్తోంది అన్నట్టుగా పదేపదే ఆ తొండాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది. ఇదేంటబ్బా.. నేనెక్కడికి వెళ్తే అక్కడికొస్తోంది ఏంటబ్బా అనుకున్న ఆ గున్న ఏనుగు.. ఆ తొండాన్ని ఒక చోట తొక్కి దాన్ని అక్కడే వదిలేద్దాం అనుకుంది. కానీ అది కూడా కుదరలేదు. 

ఏం చేసినా.. ఎంత దూరం వెళ్లినా తనకంటే ముందే అక్కడికి వెళ్తున్న తొండాన్ని కింద చుట్ట చుట్టి అక్కడ పడేద్దామనుకుంది. కానీ అది కూడా సాధ్యపడలేదు. ఇదంతా గమనిస్తున్న తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు తనంతట తనే నేర్చుకుంటుందిలే అన్నట్టుగా, తనకెమీ పట్టనట్టుగా వదిలేసింది. ఈ విషయం బోధపడని పిల్ల ఏనుగు మాత్రం తన తొండం గురించి అయోమయంగా చూస్తూ దాంతో ఆడుకోవడం మానలేదు. ఈ మొత్తం దృశ్యాలన్నీ ఎవరో తమ కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

ఇది కూడా చదవండి : Single Lion Vs Group of Hyena's: హైనాల ఆకలికి అంతుండదు.. ఒంటరిగా చిక్కిన సింహాన్ని ఎలా వెంటపడి తింటున్నాయో చూడండి!

పిల్ల ఏనుగు పిల్ల చేష్టలు చూసి నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. జంతువుల వింత చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. ఇంకొన్నిసార్లు కడుపుబ్బా నవ్విస్తాయి. క్యూట్‌గా ఆకట్టుకుంటాయి. ఈ పిల్ల ఏనుగు వీడియో కూడా అలాంటిదే. పెద్ద ఏనుగు బీభత్సం సృష్టిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. ఈ పిల్ల ఏనుగు క్యూట్ యాక్ట్స్ కూడా అంతే క్యూట్ గా అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజెన్స్ పిల్ల ఏనుగు అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Headless Snake Video: వారెవ్వా.. తల తెగి పడిన.. వ్యక్తిపై దాడి చేస్తున్న పాము.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్న జనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News