Navjot Singh Sidhu: 34 కిలోల బరువు తగ్గిన సిద్ధూ.. జైల్లో సిద్ధూ ఏం పని చేస్తున్నాడో తెలుసా ?

Navjot Singh Sidhu Weight Loss Secrets: 1988 కేసులో ఏడాది జైలు శిక్షలో భాగంగా ఇప్పటికే ఆరు నెలలు శిక్షా కాలం పూర్తి చేసుకున్న సిద్ధూ మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి ఉంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత ఆరు నెలల్లోనే 34 కిలోల బరువు తగ్గాడని నవతేజ్ సింగ్ చీమ తెలిపారు.

Written by - Pavan | Last Updated : Nov 28, 2022, 08:17 PM IST
  • జైల్లో 34 కిలోల బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • సిద్ధూ బరువు తగ్గడానికి చిప్ప కూడు కారణం కాదు
  • జైల్లో ఉన్నప్పటికీ లైఫ్ స్టైల్ విషయంలో ఏ మాత్రం రాజీపడని నవజ్యోత్ సింగ్ సిద్ధూ
Navjot Singh Sidhu: 34 కిలోల బరువు తగ్గిన సిద్ధూ.. జైల్లో సిద్ధూ ఏం పని చేస్తున్నాడో తెలుసా ?

Navjot Singh Sidhu Weight Loss Secrets: 1988 నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత 6 నెలలుగా పాటియాలా సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరు నెలల కాలంలో సిద్ధూ 34 కిలోల బరువు తగ్గారట. జైల్లో ఉంటే ఆ చిప్పకూడు తినలేక ఎవరైనా బరువు తగ్గుతారు లే అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే సిద్ధూ విషయంలో జరిగింది అది కాదు. జైలుకు వెళ్లడానికి ముందు పంజాబ్ పీసీసీ చీఫ్ గా, మాజీ క్రికెటర్ గా ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ అనుభవించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏం చేసి అంతలా బరువు తగ్గించుకున్నాడు అనే కుతూహలంగా ఉంది కదూ.. అయితే రండి మొత్తం స్టోరీ తెలుసుకుందాం. 

నవజ్యోత్ సింగ్ సిద్ధూ అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అయిన నవతేజ్ సింగ్ చీమ ఇటీవల పాటియాలా జైలుకు వెళ్లి సిద్ధూతో ములాఖత్ అయి వచ్చారు. సిద్ధూని కలిసొచ్చిన తరువాత సిద్ధూలో కనిపించిన మార్పు గురించి మీడియాకు వెల్లడించారు. ఏడాది జైలు శిక్షలో భాగంగా ఇప్పటికే ఆరు నెలలు శిక్షా కాలం పూర్తి చేసుకున్న సిద్ధూ మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి ఉంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత ఆరు నెలల్లోనే 34 కిలోల బరువు తగ్గాడని నవతేజ్ సింగ్ చీమ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత బరువు తగ్గుతారని.. జైలు నుంచి విడుదలయ్యే నాటికి నవజ్యోత్ సింగ్ సిద్ధూని చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేరని నవతేజ్ చెప్పుకొచ్చారు. 

రోజూ క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయమం చేయడంతో పాటు కఠినమైన డైట్ కూడా అనుసరిస్తుండటమే నవజ్యోత్ సింగ్ సిద్ధూ బరువు తగ్గడానికి కారణంగా నవతేజ్ సింగ్ చెప్పుకొచ్చారు. నిత్యం నాలుగు గంటల పాటు ధ్యానం, రెండు గంటలపాటు యోగా, వ్యాయమం తప్పనిసరిగా చేస్తున్నారని అన్నారు. 2 - 4 గంటలు రీడింగ్ కాగా కేవలం 4 గంటలే నిద్రకు సమయం కేటాయిస్తున్నట్టు నవతేజ్ తెలిపారు. కఠినమైన నియమావళి, ఆహారపు అలవాట్ల కారణంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ 34 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం సిద్ధూ 99 కిలోల బరువు ఉన్నారు. కాకపోతే సిద్ధూ 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉండటంతో ఆ బరువు అంత ఎక్కువగా ఏమీ కనిపించడం లేదు. పైగా సిద్ధూ ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అంటూ నవతేజ్ సింగ్ చెప్పుకొచ్చారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూకి స్పెషల్ డైట్
నవజ్యోత్ సింగ్ సిద్ధూ నాన్-అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడుతున్నారు. దీంతో డాక్టర్లు సిద్ధూకి స్పెషల్ డైట్ సజెస్ట్ చేశారు. కొబ్బరి నీరు, చామంతి చాయ, బాదాం పాలు, రోజ్ మేరీ ఆకులతో చేసిన ఛాయ వంటి ఔషధ గుణాలు ఉన్న ఆహారం మాత్రమే డైట్ గా తీసుకుంటున్నారు. పంచదార, గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అసలే తీసుకోరు. రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆహారం తినకూడదు అనే నియమాన్ని కూడా పాటిస్తున్నారు. 

నవజ్యోత్ సింగ్ సిద్ధూ జైల్లో ఏం డ్యూటీ చేస్తున్నారంటే..
పాటియాలా సెంట్రల్ జైల్లో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ జైల్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తాను శిక్ష అనుభవిస్తున్న బ్యారక్ వద్దకే వచ్చి రాత పనికి సంబంధించిన దస్త్రాలు అప్పగించి వెళ్తారు. అక్కడే పని పూర్తి చేసి ఇవ్వడం సిద్ధూ కర్తవ్యం. ఎప్పటికప్పుడు పని పెండింగ్ లేకుండా సిద్ధూ ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేస్తున్నాడట. జైల్లో పని చేసిన ఖైదీల్లో మెళకువలు, నైపుణ్యం లేని వారికి, కొద్దో గొప్పో తెలిసిన వారికి ఒకే విధంగా రోజుకు రూ. 40 - 50 వరకు వేతనం చెల్లిస్తారు. బాగా నైపుణ్యం ఉన్న వారికి రోజుకు రూ. 60 వరకు చెల్లిస్తారు. సిద్ధూ కూడా ఇప్పుడు రూ. 60 వేతనంగా పొందుతున్నట్టు తెలుస్తోంది. 

ప్రముఖ పంజాబి సింగర్ దలేర్ మొహంది కూడా ఇదే జైల్లో శిక్ష అనుభవించారు. అయితే, సెప్టెంబర్ నెలలో దలేర్ మొహంది జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అప్పటి వరకు దలేర్ మొహంది, నవజ్యోత్ సింగ్ సిద్ధూ జైల్లో ఎంతో సన్నిహితంగా మెదిలారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఫేమస్ క్రికెటర్ కావడంతో పాటు కామెడి నైట్స్ విత్ కపిల్ లాంటి కామెడి రియాలిటీ షోలలో కపిల్‌తో కలిసి దర్శనం ఇవ్వడంతో జైల్లోనూ తోటి ఖైదీలు సిద్ధూను ( Navjot Singh Sidhu ) కలిసేందుకు పోటీపడుతున్నారు.

Also Read : Supreme Court: న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. అలాంటి ప్రకటన చేయకూడదు

Also Read : Ramdev Baba: నేను తీవ్రంగా చింతిస్తున్నా అంటూ.. మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు!

Also Read : Cell Phone Tower: పట్టపగలే సెల్‌ఫోన్‌ టవర్‌ను చోరీ చేసిన దొంగలు.. ఏం కారణం చెప్పారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News