MS Dhoni's Net Worth And Business Investments: మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది అతడి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది. కెప్టేన్సీగా వ్యవహరించిన అన్ని ఫార్మాట్లలోనూ ఇండియాకు ప్రపంచ కప్ అందించడమే కాకుండా వివిధ సిరీస్ లు, ట్రోఫీలలోనూ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు అత్యధిక విజయాలు అందించి ఘనతను సొంతం చేసుకున్నాడు. అందుకే ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ గానూ ధోని అనేక సందర్భాల్లో వార్తల్లోకెక్కాడు.
మహేంద్ర సింగ్ ధోనీ నెట్ వర్త్ విషయానికొస్తే.. ధోనీ వద్ద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ 1040 కోట్ల పై మాటే. ధోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా, వివిధ రకాల ఉత్పత్తులు, వాణిజ్య సంస్థల బ్రాండ్ ఎండార్స్మెంట్స్, సోషల్ మీడియా, క్రీడలలో పెట్టుబడులు, ఖరీదైన బైక్స్, లగ్జరీ కార్లను సేకరించడం వంటివన్నీ లెక్కపెడితే ధోనీ వద్ద ఉన్న ఆస్తి రూ. 1040 కోట్లు దాటుతుంది అని అంచనాలు చెబుతున్నాయి.
ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ.. అందరికంటే సంపన్నుడిగా ధోనిని నిలబెట్టే అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలో అత్యధిక కాలం పాటు కేప్టేన్ గా వ్యవహరించడంతో పాటు ఐపిఎల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడిగా హై సక్సెస్ రేట్ ఉన్న ఆటగాడు కూడా కావడం విశేషం. ఐపిఎల్ ఆటగాడిగా వివిధ ఒప్పందాల నుంచి ధోనీ భారీగానే డబ్బు సంపాదించాడు.
మహేంద్ర సింగ్ ధోనికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ధోనీ ప్రమోట్ చేసే ఉత్పత్తులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన రేటు చార్ద్ చేస్తాడు. అలా సామాజిక మాధ్యమాల ద్వారా సైతం ధోనీ డబ్బు సంపాదిస్తున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తన ఇన్నేళ్ల స్పోర్ట్స్ కెరీర్లో సంపాదించిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఫుట్‌బాల్, మోటార్‌స్పోర్ట్స్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఆయా పెట్టుబడులు డివిడెండ్స్, రిటర్న్స్ రూపంలో మరింత సంపాదన సమకూరేలా చేస్తున్నాయి.
మహేంద్ర సింగ్ ధోనికి ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం. ప్రపంచంలోనే ఎంతో క్రేజున్న మోటార్‌సైకిల్స్ ధోనీ వద్ద ఉన్నాయి. పాతకాలం నాటి లిమిటెడ్ ఎడిషన్ హై-ఎండ్ బైక్స్ కలెక్షన్ కూడా ధోనీ వద్ద ఉంది.
అంతేకాకుండా ధోనీకి లగ్జరీ కార్లపై కూడా విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పటికే ధోనీ ఎన్నో కార్లను కలెక్ట్ చేసి ఉన్నాడు. ఫేమస్ బ్రాండ్స్‌కి సంబంధించిన ప్రీమియం కార్లు ధోనీ కాంపౌండ్ లో క్యూ కట్టి ఉంటాయి. ఖరీదైన బైక్స్, కార్లతో ప్రత్యేకించి ఎలాంటి ఆదాయం సంపాదించనప్పటికీ.. వాటి విలువ పరంగా చూసినప్పుడు ధోనీ మొత్తం ఆస్తికి ఇవి కూడా తోడు అవుతున్నాయి. ఇవన్నీ కలిపి ధోనీ మొత్తం ఆస్తి విలువ రూ. 1040 కోట్ల పై మాటే ఉంటుంది అని తెలుస్తోంది.