Inland Taipan is Most dangerous venomous snakes in the world: ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అందులో అత్యంత విషపూరితమైన పాములు చాలానే ఉన్నాయి. మనకు కేవలం నాగుపాము, కింగ్ కోబ్రా, కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, శ్వేత నాగు, రక్త పింజర లాంటి విషపూరితమైన పాములు మాత్రమే తెలుసు. అయితే మనకు తెలియని ఎన్నో రకాల విషపూరితమైన పాములు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయి. అవి కాటేస్తే.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ భూ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఇన్లాండ్ తైపాన్.
నీటిలో ఉండే బిల్చెర్స్ సీ స్నేక్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము అయితే.. భూమిపై అత్యంత విషపూరితమైన పాము ఇన్లాండ్ తైపాన్. ఈ పాము ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవు. అది కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇన్లాండ్ తైపాన్ పాములు పగటిపూట కనిపించడం చాలా చాలా తక్కువ. ఈ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. ఇక వీటి కోరలు 3.5-6.2 మిల్లి మీటర్ల పొడవు ఉంటాయి.
ఇన్లాండ్ తైపాన్ పాములు ఋతువులను బట్టి చర్మం రంగును మార్చుతాయి. చలికాలంలో ముదురు గోధుమ రంగులో, వేసవి కాలంలో లేత గోధుమ రంగులో ఉంటాయి. తెల్లవారుజామున ఇవి చాలా చురుకుగా ఉంటాయట. లోతుగా ఉన్న మట్టి పగుళ్లు లేదా జంతువుల బొరియలలో ఇవి ఉంటాయి. ఎలుకలు, కప్పలు, చేపలు, పలు రకాల గుడ్లు, కోడి పిల్లలు, కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇక ఇన్లాండ్ తైపాన్ ఒక కాటుతో 110 మిల్లీ గ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విషంతో 100 మంది వ్యక్తులను లేదా 2 లక్ష్యల 50 వేల ఎలుకలను చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఇన్లాండ్ తైపాన్ కాటేస్తే కొన్ని సెకండ్లలో మనిషి చనిపోతాడు. ఇన్లాండ్ తైపాన్ విషం నాగుపాము కంటే 50 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ పాము ఒక కాటులో 100-110 మిల్లీ గ్రాముల విషాన్ని చిమ్ముతుంది. అంటే 100 మంది మనుషులను చంపడానికి ఈ విషం సరిపోతుంది. ఇన్లాండ్ తైపాన్ విషం చాలా ప్రభావంతమైనదని పరిశోధకులు తెలిపారు. ఈ భూ ప్రపంచంలో దాదాపు 600 విషపూరిత పాములు ఉన్నా.. అత్యంత విషపూరితమైన పాములు దాదాపు 200 వరకు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.
Also Read: Nagakanya In Karimnagar: నేనే నాగకన్యను.. నాకు గుడి కట్టండి! పాములాగా యువతి వింత చేష్టలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.