Plants and Snakes: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే ఎంత దూరంలో ఉన్నా పాములు చొరబడతాయి జాగ్రత్త

Plants attracts snakes in telugu: ఇంటి పెరట్లో మొక్కల పెంపకంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. రకరకాల అందమైన సువాసనలు వెదజల్లే మొక్కల్ని అత్యంత ఇష్టంగా పెంచుకుంటుంటారు. కానీ ఈ ఇష్టమే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. మీరు ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఆపదకు కారణం కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2024, 03:34 PM IST
  • పాముల్ని ఇట్టే ఆకర్షించే మొక్కలు
  • గార్డెనింగ్ ఇష్టమున్నా అప్రమత్తత అవసరం
  • ఆ మొక్కలుంటే పాములున్నట్టే
Plants and Snakes: మీ ఇంట్లో ఈ మొక్కలుంటే ఎంత దూరంలో ఉన్నా పాములు చొరబడతాయి జాగ్రత్త

Plants attracts snakes in telugu: గార్డెనింగ్ పట్ల ఎంత ఆసక్తి ఉన్నా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ప్రాణంతక పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు పాముల్ని ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఆ మొక్కలు పూల మొక్కలు కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు లేదా కూరగాయలు, పండ్ల మొక్కలు కూడా కావచ్చు. అందుకే గార్డెనింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

గార్డెనింగ్ అంటే ఇష్టముండేవారికి ఈ ఆర్టికల్ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు తెలిసో తెలియకో కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే పాములు ఇట్టే ఆకర్షింపబడతాయి. ఆ మొక్కల కోసం మీ ఇంట్లోకి చొరబడతాయి. అందుకే ఏ మొక్కలు పెంచుకోవాలి, ఏవి కూడదనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సువాసనలు వెదజల్లే మొక్కలే కాదు..కొన్ని రకాల పండ్లు, కూరగాయల మొక్కలు కూడా పాముల్ని ఆకర్షిస్తుంటాయి. కొన్ని రకాల ఇంటీరియర్ లేదా ఎక్స్‌టీరియర్ మొక్కల్లో కూడా పాములు వచ్చి చేరుతుంటాయి. సాధారణంగా ఈ పాములు రక్షణ కోసం లేదా ఆహారం కోసం మొక్కల్లో వచ్చి చేరుతుంటాయి. అందుకే ఇంటి పెరట్లో గార్డెనింగ్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల మొక్కలు లేకుండా చూసుకోవడం మంచిది. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. 

పాముల్ని ఇట్టే ఆకర్షించే మొక్కలివే

ముఖ్యంగా మల్లె పువ్వు, దేవదారు, పారిజాతం చెట్లు అత్యంత సువాసన కలిగినవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవి. ఈ మొక్కలుంటే అల్లంత దూరం నుంచే సువాసన వెదజల్లుతుంటుంది. ఈ మొక్కలు ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయి. వీటి ఘాటైన వాసనకు పాములు చాలా సులభంగా వచ్చి చేరుతాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఈ మొక్కల వద్దకు వెళ్లినా కాటేస్తాయి. మరీ ముఖ్యంగా వర్షకాలం, చలికాలంలో ఈ మొక్కల్లో పాముల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి గుబురుగా ఉండే మొక్కలు కాబట్టి పాములు వచ్చి దాక్కుంటాయి. అందుకే ఇవి చాలా ప్రమాదకరం.

Also read: BSNL Long Term Plans: కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తున్న ఏకైక ప్లాన్, 395 రోజుల వ్యాలిడిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News