Costliest Pigeon | ఎగరిపోయే పావురానికి అంత విలువేంటి.. దాన్ని అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అనేగా మీరు ఆలోచిస్తోంది. ఇది మన ఇంటి పైకప్పుపై పప్పులు తినే పావురం కాదు.. రేసులో ప్రత్యర్థికి చుక్కలు చూపించే పావురం. మన ఇంటిపై డాబాలో అందంగా తిరగే ఈ పావురాలను చూస్తూ ఆనందంగా గడిపేస్తుంటాం. కానీ పావురాలతో రేసింగ్ చేసి ఆనందించే వారు కూడా కొన్ని దేశాల్లో ఉన్నారు. అచ్చం గుర్రాల్లాగే వీటి రేసు నిర్వహించి ఆనందిస్తారట. పావురాల రేసింగ్ కొన్ని దేశాల్లో చట్టబద్దం.
Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా?
ఇటీవలే జరిగిన ఒక వేలం పాటో ఈ పావురం ( Pigeon) పాటగాళ్లకు చుక్కలు చూపించింది. ఈ పావురం గురించి తెలుసుకున్నాక దీన్ని ఏకంగా రూ.14 కోట్లు పెట్టి కొన్నాడట చైనాకు చెంది ఒక వ్యక్తి. ఇక ఈ పావురం పేరు న్యూ కిమ్. ఇది చాలా అరుదైన జాతికి చెందిన పావురం. కిమ్ బెల్జియం దేశానికి చెందినది. కిమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) చిన్నపాటి సెలబ్రిటీ కూడా అయింది.
Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్! ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి
పక్షుల వేలంపాటలో ఈ పావురాన్ని చైనాకు ( China) చెందిన ఒక వ్యక్తి సొంతం చేసుకున్నాడట. ఈ వేలం పాట బెల్జియంలోని హాలే స్పితి పీపీ పిజన్ సెంటర్ లో జరిగింది. ఈ వేలం పాట నిర్వహించిన వారు పావురాలను వేగంగా ఎగిరేలా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ వేలం పాటలో మొత్తం 440 పావురాలు పాల్గొన్నాయి.
A two-year-old Belgian racing pigeon called New Kim is about to set a world record of over $1.5 million at auction 🐦 pic.twitter.com/g0qhkDW3nw
— Reuters (@Reuters) November 13, 2020
కిమ్ ఎందుకంత స్పెషలో తెలుసా?
ఈ పావురం చాలా వేగంగా ఎగురుతుందట. ఇది 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది. గుర్రాల రేసులాగే వీటి రేసింగ్ కూడా నిర్వహిస్తారట. వీటిపై విపరీతమైన బెట్టింగ్ నిర్వహిస్తారట. అందుకే వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని రేసింగ్ కోసం తీసుకెళ్తారట.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
Weird News: ఈ పావురం ధర అక్షరాలా 14 కోట్లు