Thirsty King Cobra Drinking Water: పామును చూస్తేనే అమ్మో పాము అంటూ భయంతో ఆమడ దూరం పరుగెత్తే వాళ్లు కొందరైతే.. పామును చూసి కూడా ఏమాత్రం భయపడకపోగా.. ఆ పాముకు దగ్గరుండి సపర్యలు చేసే వాళ్లు ఇంకొందరు ఉంటారు. అది కూడా అలాంటిలాంటి సాధారణ పాము కూడా కాదు.. నాగు పామును చూసి కూడా భయపడని వాళ్లు కూడా ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను చూసినప్పుడే వారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం అనిపిస్తుంది. ఇంకొందరైతే.. పాములతో స్నేహం చేసే వారి ధైర్యాన్ని చూసి ఆడు మగాడ్రా బుజ్జి అంటుంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా అలాంటి ఫీలింగ్ కలిగించే వీడియోనే.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. యూట్యూబ్ షార్ట్స్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే.. ఒక వ్యక్తి ఏదో ఒక గదిలో దాగిన పాము బయటకు రాగా.. దానికి నీళ్ల పైపుతో నీళ్లు పోస్తూ దాహం తీరుస్తూ కనిపిస్తున్నాడు.
చూశారు కదా.. ఆ నాగు పామును చూస్తేనే గుండెలు గుబేల్ మనేలా ఉంది.. ఇలాంటి పాము వెంటపడితే దాని బారి నుంచి తప్పించుకోవడం కూడా కష్టమే. పైగా అతడు ఉన్న చోటు నుంచి తప్పించుకోవడం మరింత కష్టం. కానీ అతడు మాత్రం అదేమీ పట్టనట్టుగా ఆ పాముకు దాహం తీరుస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు. బహుషా అతడికి పాములను హ్యాండిల్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అయ్యుండవచ్చు. లేదంటే అతడు జూ పార్కులో స్నేక్స్ ఎన్‌క్లోజర్‌లో కేర్ టేకర్ జాబ్ చేస్తుండవచ్చు. అందుకే ఆ పామును చూసి భయపడి పరుగెత్తకుండా .. నీళ్లు పోసి దాని దాహం తీరుస్తున్నాడు అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్.
ఇది కూడా చదవండి: Father's Day 2023 Gifts Ideas: ప్రియమైన నాన్నకు.. డాడీని సర్‌ప్రైజ్ చేయండిలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook