Python Video: ఎవడ్రా బుడ్డోడు.. ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు.. భారీ కొండచిలువపై సవారీ

Viral Video Today: ఓ బుడ్డోడు భారీ కొండచిలువపై పడుకుని ఆడుకుంటున్న వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. దాని తల పట్టుకుని వెనక్కి లాగుతూ హల్‌చల్‌ చేశాడు. ఈ వీడియోపై లెక్స్‌, కామెంట్ల వర్షం కురుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 08:29 PM IST
Python Video: ఎవడ్రా బుడ్డోడు.. ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు.. భారీ కొండచిలువపై సవారీ

 Viral Video Today: పాములు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని పాములు కాటు వేస్తే.. క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. అందుకే కొంతమంది పాములను చూడగానే.. ఆమడ దూరం పారిపోతారు. పాముల గురించి కలలో వచ్చినా.. వెన్నులో కాస్త వణుకు పుడుతుంది. ఇక ఇటీవల స్నేక్ క్యాచర్లు ఎంతో భయంకరమైన పాములను అయినా.. సింపుల్‌ పట్టేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో మాత్రం అంతకుమించి అని చెప్పొచ్చు. ఓ బుడ్డోడు భారీ కొండ చిలువపై పడుకుని ఆడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాడు ఏదో తోక మీద కుర్చొలేదండోయ్.. ముందుకు వెళుతున్న కొండ చిలువ తలను పట్టుకుని వెనక్కి లాగాడు. 

@rbempire_tv అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పటివరకు 5,20,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. 'ఓరేయ్ బుడ్డోడా.. పాములు ఆడుకునే బొమ్మలు కాదురా..' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ పిల్లోడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే పాములు ఎప్పుడైనా ప్రమాదకరమే..' అని అంటున్నారు. వీడియో చాలా భయంకరంగా ఉందంటున్నారు.

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RBEmpire Tv📺 (@rbempire_tv)

చిన్న పిల్లలను పాములకు దూరంగా ఉంచాలని.. ఏదైనా జరగరానిది జరిగితే.. అందరూ బాధపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. "చాలా ప్రమాదకరం.. దయచేసి ఈ ప్రమాదకరమైన సరీసృపాలతో ఆడకుండా ఉండండి" అని చెబుతున్నారు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News