Business Ideas: 2 నెలల కోర్సు చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నాడు

Layer Farming Business Idea: లేయర్ ఫార్మింగ్ బిజినెస్ ఐడియా గురించి ఎప్పుడైనా విన్నారా ? కేవలం 2 నెలల కోర్సు చేసిన ఓ యువకుడు ప్రస్తుతం ఈ లేయర్ ఫార్మింగ్ బిజినెస్‌లో ఏడాదికి 18 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు తెలుసా ? ఇంతకీ ఈ లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి ? అంత ఆదాయం ఎలా వస్తోంది తెలియాలంటే ఇదిగో ఇతడి సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.

Written by - Pavan | Last Updated : Nov 11, 2022, 06:13 PM IST
  • 2 నెలల పాటు కోర్సు చేసి పట్టు సాధించాడు
  • ఇంతకీ లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏమిటి ?
  • రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించిన మహేష్..
  • నేడు ఏడాదికి 18 లక్షలు ఆదాయం సంపాదిస్తున్నానంటున్న మహేష్ సక్సెస్ స్టోరీ మీ కోసం..
Business Ideas: 2 నెలల కోర్సు చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నాడు

Layer Farming Business Idea: వేగంగా మారుతున్న కాలంతో పాటే జనం ఆలోచించే విధానం కూడా అంతే వేగంగా మారుతోంది. ఒకప్పుడు యువతలో చాలామంది వ్యవసాయం కాదని కేవలం ఇంజినీరింగ్, డాక్టర్ చదువులకే ప్రాధాన్యత ఇచ్చారు. సమాజంలో వాటికే గౌరవం లభిస్తుందని ఆశించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన బిజినెస్ ఐడియా ఉండాలే కానీ వ్యవసాయంలోనూ బాగా డబ్బు సంపాదించొచ్చు.. గౌరవంగా, ఉన్నతంగానూ బతకొచ్చు అనే ధోరణిలోకి వచ్చేశారు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో కూడా డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే పౌల్ట్రీ ఫార్మింగ్‌లో ఒక భాగమైన లేయర్ ఫార్మింగ్‌పై 2 నెలల పాటు కోర్సు చేసి ఇప్పుడు సంవత్సరానికి లక్షల్లో డబ్బు సంపాదించడంతో పాటు తన చుట్టూ ఉన్న వారికి ఉపాధిని కూడా కల్పిస్తున్న ఒక వ్యక్తి గురించి మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మహేష్ ముకుంద్ పాటిల్ అనే వ్యక్తి గురించి. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని వాల్వా తాలూకా మహేష్ ముకుంద్ పాటిల్ స్వస్థలం. భారత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తోన్న పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ స్కీమ్ నుండి రెండు నెలల కాల పరిమితి కలిగిన ఎంటర్‌ప్రెన్యూవల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణ సమయంలో లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంశాన్ని ఎంచుకుని ఆ అంశంపై పట్టు సాధించాడు.

ఇంతకీ లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏమిటి ?
లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే వాణిజ్యం స్థాయిలో కోడి గుడ్ల ఉత్పత్తి కోసం గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం అన్నమాట. లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్‌లో కోళ్లను ఒక్క రోజు వయస్సు ఉన్నప్పటి నుంచే పెంచడం ప్రారంభిస్తే.. 18 నుండి 19 వారాల నాటికి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. 72 నుండి 78 వారాల వయస్సు వరకు ఈ కోళ్లు గుడ్లు పెడతాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 18 వారాల నుంచి కాస్త అటు ఇటుగా 75 వారాల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది.. ఆదాయం వస్తూనే ఉంటుంది. కోడి గుడ్ల వ్యాపారులతో కలిసి మార్కెటింగ్ చేసుకుంటే సరి.. మీ ఆదాయానికి ఇక డోకా లేనట్టే. 

10 వేల కోళ్లతో లేయర్ ఫార్మింగ్ ప్రారంభించిన మహేష్ ముకుంద్ పాటిల్
2 నెలల పాటు కోర్సు పూర్తి చేసిన అనంతరం మహేష్ ముకుంద్ పాటిల్ 10 వేల కోళ్లతో ఓ షెడ్డును ఏర్పాటు చేసి బిజినెస్ ప్రారంభించాడు. ఆరోగ్యానికి మేలు చేసే ఫీడ్, ఫీడ్ సప్లిమెంట్స్‌పై పూర్తి అవగాహన ఏర్పర్చుకున్న మహేష్ ముకుంద్ పాటిల్.. కోళ్లకు ప్రోటీన్లు, విటమిన్లు, మినెరల్స్ చాలా అవసరం అని చెబుతున్నాడు. అవి గుడ్డు నాణ్యత, లేయర్ పౌల్ట్రీ ఫెర్టిలిటీతో పాటు కోడి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయంటున్నాడు. 

రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించిన మహేష్..
మహేష్ ముకుంద్ పాటిల్ కోర్సును పూర్తి చేసిన తరువాత తన తల్లిదండ్రుల వద్దే రూ.20 లక్షలు అప్పు తీసుకుని బిజినెస్ ప్రారంభించాడు. ఆ రూ. 20 లక్షలతో షెడ్డును ఏర్పాటు చేసుకోవడంతో పాటు 10 వేల కోళ్లతో లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ ప్రారంభించాడు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెంది సంవత్సరానికి ఏకంగా రూ.18 లక్షల టర్నోవర్ సంపాదించే స్థాయికి ఎదిగింది. మహేష్ ముకుంద్ పాటిల్ సక్సెస్ స్టోరీ చూశాకా ఆ చుట్టుపక్కల మరో ఐదు గ్రామాల్లో దాదాపు 90 మంది వరకు రైతులు అతడి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. 

మీకు తెలిసిన సక్సెస్ స్టోరీలు మాతో పంచుకోండి.. ఆ సక్సెస్ స్టోరీని నలుగురికి చెప్పే బాధ్యత మేం తీసుకుంటాం..
సంవత్సరానికి 18 లక్షల వరకు సంపాదిస్తోన్న మహేష్ ముకుంద్ పాటిల్ సక్సెస్ స్టోరీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ బయటి ప్రపంచానికి పరిచయం చేసింది. కరెక్ట్ బిజినెస్ మోడల్, అంకిత భావం ఉండాలే కానీ వ్యవసాయంలోనూ లక్షల సంపాదించొచ్చు.. గౌరవంగా బతకొచ్చు అని మహేష్ ముకుంద్ పాటిల్ నిరూపించాడు కదా.. ఇలాగే మీకు తెలిసిన సక్సెస్ స్టోరీలు కూడా ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్సులో కానీ లేదా మా సోషల్ మీడియా పేజీలలో ఆర్టికల్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.. ఆ సక్సెస్ స్టోరీని నలుగురుకి చేర్చేందుకు మావంతు ప్రయత్నం మేం చేస్తాం.

Also Read : Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే

Also Read : NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్ తీసుకోవాలంటే..ఏం చేయాలి

Also Read : LIC Scheme: ఆ ఎల్ఐసీ పధకంలో..నేరుగా కోటి రూపాయలు ప్రయోజనం, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News