Tragic Incident: అనారోగ్యానికి గురయిన చెల్లెలిని కాపాడుకోవడానికి ఆ సోదరులు తీవ్రంగా శ్రమించారు. స్థానిక ఆస్పత్రిలో చూపించగా పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి తీసుకెళ్దామంటే ప్రకృతి వైపరీత్యం ఆటంకంగా మారింది. వరదలతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఆ సోదరులు నడుచుకుంటూ ఐదు కిలీమీటర్లు వెళ్లారు. కానీ అంతలోనే మార్గమధ్యలో తమ చెల్లెలు కన్నుమూసింది. సోదరులు చెల్లెలి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Also Read: Youtubers Tirumala Prank: తిరుమల భక్తులతో యూట్యూబర్ల వికృత చేష్టలు.. భక్తుల మనోభావాలతో చెలగాటం
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లా పాలియా అనే ప్రాంతానికి చెందిన శివానీ స్థానికంగా 12వ తరగతి చదువుతోంది. తన ఇద్దరు అన్నలతో కలిసి ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట శివానీ అనారోగ్యానికి గురయ్యింది. ఆస్పత్రికి వెళ్తే టైఫాయిడ్ అని చెప్పారు. స్థానిక వైద్యులు తాత్కాలిక వైద్యం చేసి పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వారికి తీవ్ర అడ్డంకింగా మారింది.
Also Read: PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్
భారీ వర్షాలకు వరదలు రావడంతో పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో లఖీంపూర్ ఖేరీ పట్టణానికి సంబంధాలు మొత్తం తెగిపోయాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆ సోదరులు తమ సోదరిని ఆస్పత్రికి తరలించేందుకు సాహసమే చేశారు. రైల్వే మార్గం ద్వారా పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.
రవాణా సౌకర్యం లేకపోవడంతో చెల్లెలు శివానీని భుజాలపై ఎత్తుకుని వెళ్లడం ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించి సోదరుల భుజాలపైనే శివానీ కన్నుమూసింది. చెల్లెలు మరణించడంతో ఆ ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. విలపిస్తూనే బతుకుతుందనే ఆశతో మృతదేహన్ని 5 కిలోమీటర్ల మేరకు భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లారు. అయితే పరిశీలించిన వైద్యులు శివానీ అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. దీంతో ఆ సోదరులు బోరున విలపించారు.
గుండెల్ని పిండేసే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వరదలకు తోడు స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేక శివానీ చనిపోయింది. ఈ సంఘటనపై నెటిజన్లు కంటతడి పెడుతుండగా.. మరికొందరు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైద్య సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వైద్య సౌకర్యం అందక మరణాలు సంభవించడం దారుణంగా పేర్కొంటున్నారు.
The picture from Lakhimpur Kheri district in Uttar Pradesh is heart-wrenching.
Shivani was suffering from typhoid. Due to the floods, she could not be taken to a good doctor in the city. She died on the way. Her brother is carrying his sister's dead body on his shoulder...
— Sneha Mordani (@snehamordani) July 12, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు