King Cobra Bathing Video: చిన్న పాము పిల్లను చూడగానే మనలో చాలా మంది ఆమడ దూరం పరిగెడతారు. అదే కాస్త పెద్ద పాము కనిపిస్తే.. వెన్ను వణుకు పుట్టడం ఖాయం. అయితే కొందరు మాత్రం పాములంటే ఎలాంటి భయం లేకుండా వాటితోనే సవాసం చేస్తుంటారు. అలవోకగా వాటితో ఆడుకుంటూ స్నేహం చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి నాగుపాముకు స్నానం చేయిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ పాముకు బుసలు కొట్టకుండా.. స్నానం చేయించుకోవడం విశేషం. ఈ వీడియో పాతదే అయినా.. నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"కింగ్ కోబ్రాకు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. పాములు తమను తాము రక్షించుకునేందుకు.. తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు కూసం వీడుస్తాయి. అలాంటప్పుడు అంత రిస్క్ చేసి స్నాం చేయించడం ఎందుకు..? నిప్పుతో ఆడుకోవడం అవసరమా..?" అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. వీడియోలో పాము వాటర్ పోసే మగ్గును గట్టిగా నోటితో పట్టుకునేందుకు యత్నించింది. చిన్నపిల్లలకు స్నానం చేయించినట్లే దానిపై ఆ వ్యక్తి నీళ్లుపోస్తున్నాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.
Bathing a king cobra😳
Snakes have skin to protect & keep them clean, which they shed periodically.
So what’s the need for playing with fire? pic.twitter.com/rcd6SNB4Od— Susanta Nanda (@susantananda3) October 17, 2023
అతను స్నానం చేయిస్తున్న సమయంలో కింగ్ కోబ్రా సైలెంట్‌గా ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతపెద్ద పామును ఎలా హిప్నోటైజ్ చేశాడని అడుగుతున్నారు. థాయ్‌లాండ్‌లో పాముల ప్రదర్శనలకు ఇలాంటి వాటిని తీసుకువస్తారని.. అక్కడి వాళ్లకు హిప్నోటైజ్ చేయడం అలవాటు అని ఓ వినియోగదారు కామెంట్ చేశాడు. వాళ్లు థాయ్ కోబ్రా షో నుంచి వచ్చారని.. వారు పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారని చెబుతున్నారు. చాలా మంది పాములు చిన్న వయసులో ఉన్నప్పుడే తీసుకొచ్చుకుని పెంచుకుంటారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "ఈ పామును థాయ్‌లాండ్ లేదా వియత్నాం నుంచి తీసుకువచ్చినట్లు అనిపిస్తుంది. కడిగిన తర్వాత వారు వాటిని విక్రయించడానికి బోనులలో ఉంచుతారు." అని ఓ వ్యక్తి అన్నాడు.
Also Read: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..
Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్ ఆఫర్ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.