Big Cobra Eating Food Video: నాగుపాము చూస్తేనే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. నాగుపాము పడగ విప్పిందా.. ఇక ఆమడదూరం పరుగెత్తుతారు. ఆ కనుచూపు మేరల్లో మళ్లీ వెళ్లమన్నా వెళ్లరు. పాములంటే కొంతమందికి అంత భయం. మరీ ముఖ్యంగా నాగుపాము లాంటి విషపూరితమైన సర్పాలను చూస్తే ఆ భయం చాలామందిలో కనిపిస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఆ పాములతోనే జీవిత కాలం గడిచిపోతుంది. పొద్దున్నే నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకు.. ఆ పాములతోనే వారి జీవితం ముడిపడి ఉంటుంది.
అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పాములు పట్టడం, పాములకు ఫీడింగ్ చేయడం, పాములను ఆడించడం, పాముల సంరక్షణ బాగోగులు చూడటం వంటి పనులు ఆ కోవలోకి వచ్చేవే. అందుకే వారికి పాములు అంటే ఏ మాత్రం భయం ఉండదు. ఒక్క పామును చూస్తేనే భయంతో అల్లంత దూరం పరుగెత్తే వారికి, వందలాది పాముల మధ్య ఉన్నప్పటికీ.. పెంపుడు జంతువుల మధ్య ఉన్నంత కూల్ గా ఉండే వీరికి మధ్య ఉండే తేడా అదే.
Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనం.. మీరున్నారా?
ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక డేంజరస్ స్నేక్ వీడియో. ఆరు, ఏడు అడుగుల పొడవు ఉన్న భయంకరమైన నాగు పాముల మధ్య ఉంటూ వాటికి మాంసం ముక్కలను ఫీడింగ్ చేస్తున్న ఈ వ్యక్తి ధైర్యాన్ని చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాల్లో ఉన్న భయంకరమైన నాగు పాములను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న ఆ వ్యక్తి.. వాటికి ఆహారం అందిస్తున్నాడు. కానీ ఒక్క పాముకు మాత్రం ఆహారం అందివ్వడం ఆలస్యం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.
చూశారు కదా ... కళ్ల ముందే ఆహారం ఉన్నప్పటికీ ... ఆ ఆహారాన్ని తిననివ్వకుండా ఆలస్యం చేస్తున్న యజమానిని చూసి ఆగ్రహం చెందిన కింగ్ కోబ్రా.. వెంటనే యజమానిపైకి బుసలు కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతిమంగా ఆహారం తిన్న తరువాతే.. ఆ పాము శాంతించింది. అలా రోజూ పాముల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్న వారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పాము కాటుకు బలి కావాల్సిందే. అలా పాముల మధ్యే జీవితాన్ని గడిపేస్తూ చివరకు ఆ పాము కాటుకు బలైన వారి కేసులు కూడా ఎన్నో ఉన్నాయి.
Also Read: Knee Joint Pain: ఈ డైట్‌తో మోకాళ్ల, కీళ్ల నొప్పులు కేవలం 15 రోజుల్లో తగ్గడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook