Man Playing with Cobra: పాముతో పరాచకాలు.. 16 అడుగుల కింగ్ కోబ్రాతో ఫన్నీగా ఆడుకున్న వ్యక్తి!

Man Playing with Dangerous Black Cobra: కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి ఫన్నీగా ఆడుకున్నాడు. ఎంతలా అంటే కుక్క పిల్ల మాదిరి కింగ్ కోబ్రాతో ఆడుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 12, 2023, 06:29 PM IST
  • కుక్క పిల్ల మాదిరి..
  • 16 అడుగుల కింగ్ కోబ్రాతోనే ఆడుకున్న వ్యక్తి
  • చివరికి ఏమైందంటే..??
Man Playing with Cobra: పాముతో పరాచకాలు.. 16 అడుగుల కింగ్ కోబ్రాతో ఫన్నీగా ఆడుకున్న వ్యక్తి!

Man Playing with 16 Feet Black King Cobra: రోడ్డుపై వెళ్తూ చిన్నపాటి పాము మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది 'కింగ్ కోబ్రా' కనిపిస్తే ఆ చుట్టుపక్కల కూడా ఉండం. ఎందుకంటే కింగ్ కోబ్రా కాటేస్తే మనిషి బ్రతకడం చాలా కష్టం. అలాంటి కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి ఫన్నీగా ఆడుకున్నాడు. ఎంతలా అంటే.. కుక్క పిల్ల మాదిరి కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకున్నాడు. అంతేకాదు దాన్ని ఒట్టి చేతులతో పట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో (King Cobra Man Viral Video) ప్రకారం... ఓ స్నేక్ క్యాచర్ అడవిలో భారీ సైజ్ ఉన్న బ్లాక్ కింగ్ కోబ్రాను చూస్తాడు. అతడిని చూసిన పాము పొదల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. వెంటనే అతడు తోక పట్టుకుని బయటకు లాగుతాడు. దాంతో ఆ వ్యక్తిపై బుసలు కొడుతూ దూసుకొచ్చింది. కింగ్ కోబ్రా పడగ విప్పి ఉండగా.. ఆ వ్యక్తి దాని ముందు కూర్చుని పాము కళ్లలోకి చూస్తుంటాడు. ఆపై చెట్టుతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అది కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. అలెర్ట్ అయిన ఆ వ్యక్తి పాము కాటు నుంచి కొద్దిలో తప్పించుకుంటాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News